నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. కేవలం టీలో చక్కెరను తగ్గించడం వల్ల మాత్రమే డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించలేం. చక్కెరను ప్రతిరోజూ వివిధ మార్గాల్లో వినియోగిస్తుంటాం. కొన్నిసార్లు స్వీట్లు, ఇతర ఆహారాల్లో కూడా చక్కెరను కలుపుతుంటారు..
అయితే చక్కెర వినియోగాన్ని తగ్గించవచ్చుగానీ పూర్తిగా ఆపకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
అలాగే అధిక చక్కెర కలిగి ఉండే శీతల పానీయాలను పూర్తిగా నివారించాలి. కృత్రిమ చక్కెర మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పూర్తిగా చక్కెర తీసుకోవడం మానేయకుండా నిర్దిష్ట కొలతల ప్రకారం దీనిని తీసుకోవచ్చు.
రోజంతా ఎంత చక్కెర తీసుకోవాలనేది మీ జీవనశైలి, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజువారీ జీవన కార్యకలాపాలను నిర్వహించడానికి, శారీరకంగా చురుకుగా ఉండటానికి కేలరీలు అవసరం.