ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి?

నిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు తినాలి అనేది కూడా తెలిసి ఉండాలి. సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే వారి శరీర పరిస్థితిని బట్టి వారి జీవన శైలిని బట్టి వారు రోజుకు ఎన్నిసార్లు తినాలి అనేది ఆధారపడి ఉంటుంది.


కొందరు రోజుకు మూడు సార్లు తినడం మంచిది అని చెబితే, మరికొందరు రోజుకు 4 నుండి 5 సార్లు కొద్దికొద్దిగా తినడం మంచిదని భావిస్తారు.

ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో సమయానికి తినడం, ఎంత తింటున్నామో తెలియడం, ఎన్నిసార్లు తింటున్నామో తెలియడం కూడా అంతే ముఖ్యం. డైటీషియన్లు అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు మూడుసార్లు సమతుల్యమైన ఆహారం తినడం చాలా మంచిదని, ఇది చాలామందికి అనుకూలమైన ఆహారమని, ఇది మంచి భోజన నియమం అని చెబుతారు.

రోజుకు ఇన్నిసార్లు తింటే మంచిది

రోజుకు మూడుసార్లు తినే ఆహారం ఉన్న శక్తి స్థాయిలను నిర్వహించడంలో మన శరీరంలో మెటబాలిజంను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇక ఈ మూడు భోజనాలకు మధ్య ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం కూడా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. పండ్లు లేదా గింజలు వంటి ఆహార పదార్థాలను ఈ మూడు భోజనాల మధ్యలో తీసుకుంటే మంచిదని చెబుతారు.

తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు తినడం వారికి మేలు

ఇక ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఒకటేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోకుండా, తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరగకుండా ఉండడానికి ఇది దోహదం చేస్తుందని చెబుతారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట భోజనం సాధారణమైన ఆరోగ్యకరమైన జీవన శైలికి సరిపోతుంది. శ్రమ చేసే వారికి, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి, తక్కువ ఆహారాన్ని, తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు తినడం మేలు చేస్తుందని చెబుతారు.

ఆహారం ఇలా ఉండేలా ఉంటే మంచిది

ఇక ఆహారం తీసుకునేటప్పుడు ప్రతి ముద్దను నమిలి తినడం వల్ల ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు ఆహారం తీసుకునేటప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలని, ఆకలి లేనప్పుడు బలవంతంగా ఆహారం తినడం మంచిది కాదని కూడా చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలని కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలని చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.