బిగ్ బాస్ ఒక్క సీజన్ కి అయ్యే ఖర్చెంత, వచ్చే లాభం ఎంతంటే

ఇప్పటివరకు టెలివిజన్ రంగంలో ఏ షోకి రానంత పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక రియాల్టీ షో ‘బిగ్ బాస్’… ఈ షో వచ్చేంత వరకు ఒక షో మీద భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం రిస్క్ అని చాలా చాలామంది భావిస్తుండేవారు.


కానీ బిగ్ బాస్ షో మీద భారీ ఎత్తున ఖర్చుపెట్టి అంతకు మించిన ప్రాఫిట్స్ ను రాబట్టడంలో షో యజమాన్యం సక్సెస్ ని సాధించారు. అందుకే ఈ షో ద్వారా మరికొన్ని షో లు సైతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ షో కి ఒక సీజన్లో దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు ఖర్చైతే వస్తోంది… ఈ షో కి హోస్ట్ గా చేసినందుకు గాను నాగార్జున భారీ మొత్తం లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విన్నర్స్ కి ఇచ్చే ప్రైజ్ మనీ, అలాగే వారం, వారం కంటెస్టెంట్లకు చెల్లించే డబ్బులు, ఇక టెక్నికల్ టీం కి అయ్యే ఖర్చు, అలాగే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్ వేసుకున్నందుకుగాను వాళ్లకు చెల్లించే మొత్తం కలిపి 6 కోట్ల వరకు అయితే అవుతుందట… ఇక ఈ షో మీద వచ్చే టిఆర్పి రేటింగ్ ద్వారా గాని, హాట్ స్టార్ లో ఈ షో ని చూస్తున్న వాళ్ళ ద్వారా గాని, అలాగే అడ్వర్టైజ్మెంట్ ల ద్వారా బ్రాండ్స్ ద్వారా దాదాపు 15 కోట్లకు పైన ఈ షో కి అయితే డబ్బులు వస్తాయి.

ఇక దాంట్లో నుంచి 6 కోట్ల రూపాయలు తీసేస్తే సంవత్సరానికి దాదాపు ఈ షో మీద 9 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ షో మీద అంత మొత్తంలో ఖర్చు చేయడానికి షో యజమాన్యం కూడా వెనకాడటం లేదు. ఇక 100 రోజులపాటు ఒక షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలి అంటే మామూలు విషయం కాదు.

అందువల్లే ఈ షో కోసం వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని మరి సంవత్సరంలో ఒక వంద రోజులు దీని మీద కేటాయించి మరి షో ను నిర్వహిస్తుండటం విశేషం… ఇక బ్యాగ్రౌండ్ ఈ షో కి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అలాగే షో ని రన్ చేయడానికి డైరెక్షన్ టీం మొత్తం ఈ షో మీద సంవత్సరం పాటు వర్క్ చేస్తూనే ఉంటారు…

నిజానికి ఒక టెలివిజన్ రంగంలో ఒక షో మీద ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అనేది మామూలు విషయం కాదు. ముందుగా వాళ్ళు డేర్ చేశారు కాబట్టి ఈ షోకి సక్సెస్ అయితే వచ్చింది…ఇక దాన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.