డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుంది ? అంచనా..!?

www.mannamweb.com


ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. జీవితంలో ఎలాగైనా సరే.. ఎప్పటికైనా సరే.. సొంత ఇంటిలో నివసించాలని కలలు కంటుంటారు. అందుకనే కష్టపడుతుంటారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే మాటలు కాదు. స్థలం ఉంటే చాలదు, డబ్బు కావాలి. అందుకు ఎంతగానో కష్టపడాలి. ఆర్థిక స్థోమత ఉంటే ఓకే, లేదంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకోవాలి.

ఇక 120 గజాల స్థలంలో ఇంటిని నిర్మించేందుకు దాదాపుగా రూ.17 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్ల వల్ల పునాది వేసేందుకే రూ.8 లక్షల వరకు అవుతుంది. ఇసుక, స్టీల్‌, సిమెంట్ వంటివి చాలా ఖరీదు అయ్యాయి. అందువల్ల ఇంటి నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుంది.

ఇక బోర్ వెల్ ఖర్చు, ఇతర పరికరాల ఖర్చలు, సామగ్రి, కూలి ఖర్చులు అన్నీ కలిపితే రూ.17 లక్షలు అవుతాయి. కానీ ఇసుక, స్టీల్‌, సిమెంట్ వంటి వాటిని ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటే రూ.4 లక్షల వరకు ఆదా చేయవచ్చు. దీంతో ఖర్చు రూ.13 లక్షలు అవుతుంది. వివిధ సామగ్రిపై ఇంకో రూ.1 లక్ష ఆదా చేయగలిగితే రూ.12 లక్షలతో ఇల్లు నిర్మాణమవుతుంది.

ప్రస్తుతం చాలా బ్యాంకులు ఇంటి లోన్లను సులభంగానే అందిస్తున్నాయి. సిబిల్ స్కోరుతోపాటు స్థిరమైన ఆదాయం ఉంటే ఇంటి రుణం పొందడం తేలికే. ఇంటి రుణం కోసం ఒకరి కన్నా ఎక్కువ మంది జాయింట్‌గా దరఖాస్తు చేస్తే రుణం వచ్చేందుకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సాధారణంగా లోన్ ఇచ్చే వారు మొత్తం ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో 85 శాతం మేర లోన్‌గా ఇస్తారు. కొందరు ఇంతకన్నా తక్కువగా లేదా ఎక్కువగా కూడా లోన్ ఇవ్వవచ్చు. లోన్ అనేది అనేక అంశాలపై ఆధార పడి ఉంటుంది.

రూ.12 లక్షలు ఇంటికి అవుతాయి అనుకుంటే.. అందులో 85 శాతం.. అంటే.. రూ.10.20 లక్షల వరకు లోన్ వస్తుందని భావించవచ్చు. మిగిలిన మొత్తాన్ని మనమే స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఇక చాలా బ్యాంకులు రూ.1 లక్ష లోన్‌కు నెలకు రూ.1000 ఈఎంఐ చొప్పున ఆఫర్లను అందిస్తున్నాయి. అంటే.. రూ.10 లక్షల లోన్‌కు రూ.10వేలు నెలకు ఈఎంఐ అవుతుంది. ప్రస్తుతం చాలా చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లకు నెలకు రూ.10వేల వరకు అద్దె ఉంటోంది. కనుక సొంత ఇల్లు కట్టుకుంటే మన ఇంటికి మనమే నెల నెలా అద్దె చెల్లించినట్లు అవుతుంది. కొన్నేళ్లు పోయాక ఇల్లు మన సొంతం అవుతుంది. అందుకనే సొంతింటిని కలిగి ఉండాలని పెద్దలు చెబుతారు.