హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే బ్యాంక్ నుంచి రూ.37 లక్షల లోన్ పొందాలంటే ఎంత జీతం ఉండాలో తెలుసుకోండి.
హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు రెండు ప్రధాన విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. మొదటిది వినియోగదారు ఆదాయం. రెండవది వారి క్రెడిట్ హిస్టరీ. ఆదాయం స్థిరంగా ఉండటం లోన్ EMI సులభంగా చెల్లించే సామర్థ్యం ఉందో లేదో బ్యాంకులు చూస్తాయి. ఉద్యోగం స్థిరంగా ఉంటే ఆదాయం క్రమం తప్పకుండా వస్తే లోన్ మంజూరు సులభం అవుతుంది.
క్రెడిట్ హిస్టరీ పరిశీలనలో వినియోగదారుడు గతంలో తీసుకున్న ఆర్థిక రుణాల నిర్వహణను చూస్తారు. ఆర్థిక బాధ్యతల విషయంలో వినియోగదారుడు ఎంత క్రమశిక్షణతో ఉన్నాడో తెలుసుకుంటారు. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీ ఆదాయాన్ని మీ క్రెడిట్ హిస్టరీని బలంగా ఉంచుకోండి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎస్‌బీఐ ప్రస్తుతం హోమ్ లోన్‌పై 7.50 శాతం నుండి 8.70 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. హోమ్ లోన్ మ్యాక్స్‌గెయిన్ (ఓడీ) మీద వడ్డీ రేటు 7.75 శాతం నుండి 8.95 శాతం ఉంది. టాప్ అప్ లోన్ వడ్డీ రేటు 8 శాతం నుండి 10.75 శాతం వరకు ఉంది. టాప్ అప్ (ఓడీ) లోన్ మీద వడ్డీ 8.25 శాతం నుండి 9.45 శాతం వరకు ఉంది.
లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వడ్డీ రేటు 9.20 శాతం నుండి 10.75 శాతం వరకు ఉంది. రివర్స్ మోర్టగేజ్ లోన్ వడ్డీ రేటు 10.55 శాతం స్థిరంగా ఉంది. యోనో ఇన్స్టా హోమ్ టాప్ అప్ లోన్ వడ్డీ రేటు 8.35 శాతం ఉంది. వివిధ లోన్ పథకాలకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
మీరు ఎస్‌బీఐ నుంచి 37 లక్షల రూపాయల హోమ్ లోన్‌ను 30 సంవత్సరాల కాలానికి తీసుకుంటే నెలవారీ EMI ఎంత అవుతుందో తెలుసుకుందాం. 7.50 శాతం వడ్డీ రేటుకు తీసుకుంటే నెలవారీ EMI 25871 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు మొత్తం వడ్డీ 5613537 రూపాయలు చెల్లిస్తారు.
ఒకవేళ మీరు లోన్ 8 శాతం వడ్డీ రేటుకు 30 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ EMI 27149 రూపాయలు అవుతుంది. మీరు మొత్తం వడ్డీ 6073744 రూపాయలు చెల్లిస్తారు. అదే లోన్ 8.50 శాతం వడ్డీ రేటుకు తీసుకుంటే నెలవారీ EMI 28450 రూపాయలు అవుతుంది. మీరు మొత్తం వడ్డీ 6541928 రూపాయలు చెల్లిస్తారు.
వ్యక్తిగత ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ అన్ని లోన్ల మొత్తం EMI లు మీ నెలవారీ జీతంలో 40 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ బ్యాంకులు సాధారణంగా నెలవారీ జీతంలో 50 శాతం వరకు EMI ఉండే లోన్‌ను ఆఫర్ చేయవచ్చు. ఇది ముందుగా వేరే లోన్లు లేకపోతే సాధ్యం అవుతుంది.
37 లక్షల రూపాయల హోమ్ లోన్ 30 సంవత్సరాలకు 7.50 శాతం వడ్డీ రేటుకు తీసుకుంటే మీ కనీస నెలవారీ జీతం 51742 రూపాయలు ఉండాలి. అదే లోన్ 8 శాతం వడ్డీ రేటుకు తీసుకుంటే కనీస జీతం 54298 రూపాయలు ఉండాలి. 8.50 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే మీ నెలవారీ జీతం కనీసం 56900 రూపాయలు ఉండాలి.
































