TTD తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయల టిక్కెట్ ఆన్ లైన్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి

తిరుమల దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. ధర్మ దర్శనం లేదా సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవడానికి గంటలకు కొద్ది సమయం పడుతుంది. ఒకరోజు 15 నుంచి 20 గంటల సమయం మీద పట్టే అవకాశం ఉంటుంది.


ఈ సమస్య నుంచి బయటపడాలంటే టీటీడీ జారీ చేసే 300 రూపాయల టికెట్ ద్వారా తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ద్వారా మీరు కొన్ని గంటల మేర సమయాన్ని స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం ప్రతి రోజు కోటా ఉంటుంది. ప్రతి నెల 4,50,000 వరకు టికెట్లు ఈ కోటా కింద విడుదల చేస్తారు. ఈ టికెట్లను బుక్ చేసుకోవడం అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మొబైల్ యాప్, లేదా కంప్యూటర్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. గతంలో ఐఆర్సిటిసి, ఆంధ్రప్రదేశ్ టూరిజం, తెలంగాణ టూరిజం, తమిళనాడు టూరిజం, కర్ణాటక టూరిజం ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా ఈ టికెట్లు లభించేవి. అయితే ప్రస్తుతం టూరిజం కోటా కింద 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు 300 రూపాయల టికెట్ కోసం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు టిటిడి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయల టికెట్ కోసం ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.