వర్షాకాలం నీటితో కారుకు ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు మీరు కూడా ప్రమాదంలో పడవచ్చు. అందుకే వానాకాలం కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మీరు, మీ కారు సేఫ్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. చెన్నై, బెంగళూరులాంటి నగరాల్లోనూ భారీగా వానలతో వరదలు వస్తున్నాయి. ఈ సమయంలో మీ కారును ఎలా నడపాలి అని కూడా మీరు తెలుసుకోవాలి. భారీ వర్షంలో డ్రైవింగ్ అనేది మీకు, మీ కారుకు మంచిది కాదు. సరిగా కనిపించకపోవడం, జారుడు రోడ్లు, నీటి గుంతలతో ప్రమాదాలు జరగవచ్చు. సురక్షిత డ్రైవింగ్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.
వానాకాలంలో తెలియని రోడ్లపై డ్రైవింగ్ చేయకూడదు. కారణం ఏంటంటే చాలా చోట్ల వానలు పడి రోడ్లన్నీ జలమయమవుతాయి. దీంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో మీకు తెలియదు. కొండ ప్రాంతాల్లో వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకూడదు.
వానాకాలంలో ఎంత అనుభవం ఉన్న డ్రైవర్ అయినా ప్రమాదాలకు గురికావొచ్చు. వర్షంలో నెమ్మదిగా నడపడం ఉత్తమం. తడి రోడ్లపై బ్రేకులు పెద్దగా స్పందించవు. కారుపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తుంటే సడెన్ బ్రేక్ వేస్తే స్కిడ్డింగ్ జరగొచ్చు. అందుకే నెమ్మదిగా వెళ్లాలి.
నీటితో నిండిన రోడ్లపై ప్రయాణించాలని నిర్ణయించుకుంటే వేగాన్ని తగ్గించేటప్పుడు కూడా మీ పాదాలను యాక్సిలరేటర్ పెడల్‌పై ఉంచాలి. ఎగ్జాస్ట్ నుండి నీటిని గ్రహించగలవు. ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది.
వానాకాలంలో రోడ్డుపై నీటి లోతు తెలియదు. నీరు నిలిచిన రోడ్లపై వాహనాలు నడపవద్దు. మీ కారు వరదలు ఉన్న రహదారిపై పార్క్ చేస్తే.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దు. ఎందుకంటే నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో చాలా డబ్బులు ఖర్చవుతుంది.
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు కనిపించేలా చూసుకోవడం ముఖ్యం. కారు వైపర్‌లను చెక్ చేయండి. వైపర్‌లపై ఉన్న రబ్బరు రోడ్డును క్లియర్‌గా చూపించేందుకు సాయపడుతుంది. నీటిని, దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది. బయటకు వెళ్లేముందు విండ్‌షీల్డ్ వైపర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి.
వర్షంలో కారు నడుపుతున్నప్పుడు సడన్ బ్రేక్ వేయకండి. ఇలా సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనం మీ కారును ఢీకొట్టే అవకాశాలున్నాయి. వానాకాలంలో ముందు ఉన్న వాహనాలు సరిగా కనిపించకపోవచ్చు. ఇంకా నీరు ఉంటే ఎగ్జాస్ట్ పైపు ద్వారా నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సడన్ బ్రేక్ వేస్తే కారు బోల్తా పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో కారు జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.