WhatsApp: కాంటాక్ట్ లిస్టులో లేని వాళ్లని వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు, మెసేజ్ లు పంపాలంటే ఏం చేయాలో తెలుసా? వారి నంబర్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలా ప్రాసెస్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్ లో ఇప్పటి వరకు ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని కేవలం కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లకు మాత్రమే పంపడానికి అవకాశం ఉండేది. ఒకవేళ కాంటాక్ట్ లిస్టులో లేని వాళ్లకు పంపాలంటే కచ్చితంగా వారి నంబర్ సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పడు మాత్రమే ఆ నంబర్ కి వాట్సాప్ ఓపెన్ అయ్యేది.
ఈ చిన్న ప్రాసెస్ తెలిస్తే సింపుల్ గా ఫోటోలు, మెసేజ్ లు, వీడియోలు తదితర ఎలాంటి సమాచారాన్ని పంపొచ్చు. నంబర్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే పంపొచ్చు.
సాధారణంగా ఏదైనా సమాచారాన్ని వేరే వాళ్లకి షేర్ చేయాలంటే ప్రత్యేకమైన యాప్స్ ఉన్నాయి. లేదా షేర్ ఆప్షన్ ఉపయోగించి ఫోటోలు, వీడియోలు పంపుతాం కదా.. అదే విధంగా ఏదైనా జిరాక్స్ షాప్ కి వెళ్లినప్పుడు వాట్సాప్ లో ఉన్న డాక్యుమెంట్స్, ఫోటోలను షాప్ యజమానికి షేర్ చేస్తే వాటిని జిరాక్స్ తీసి ఇస్తారు కదా.. మరి షాప్ యజమాని నంబర్ సేవ్ చేసుకుంటేనే డాక్యుమెంట్స్, ఫోటోలు పంపడానికి వీలవుతుంది.
అయినా ఒకసారి మాత్రమే అవసరమైన వ్యక్తుల నంబర్లు సేవ్ చేసుకోవడం వల్ల తర్వాత ఉపయోగం ఉండదు. నంబర్లు సేవ్ చేసుకుంటూ పోతే కాంటాక్ట్ లిస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇలా నంబర్లు సేవ్ చేయక్కర లేకుండా డైరెక్ట్ గా నంబర్ టైప్ చేసి సమాచారాన్ని పంపొచ్చు. ఆ ప్రాసెస్ గురించి క్లియర్ గా ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్ ఓపెన్ చేయండి.
కింద రైట్ సైడ్ చివరన “కాల్” ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
మళ్లీ కింద రైట్ సైడ్ “కాల్+” సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
అక్కడ ఫస్ట్ కనిపించే మూడు ఆప్షన్స్ లో “కాల్ ఎ నంబర్” పై క్లిక్ చేయండి.
ఇప్పుడు డయల్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది.
ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి.
ఇప్పుడు కాల్ చేయాలనుకుంటే కింద “కాల్” సింబల్ పై క్లిక్ చేసి కాల్ చేయొచ్చు.
ఒకవేళ వారికి మెసేజ్, ఫోటోలు, వీడియోలు, ఇతర డేటా ఏదైనా పంపాలనుకుంటే కింద కాల్ సింబల్ పక్కనే మెసేజ్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు అవసరమైన సమాచారాన్ని పంపండి.