జుట్టును ఒత్తుగా పెంచే నల్ల నువ్వులు.. ఎలా వాడాలంటే?

నల్ల నువ్వులు.. భారతీయ వంటకాల్లో వీటిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు. చక్కటి రుచిని కలిగి ఉండే నల్ల నువ్వులు.. తెల్ల నువ్వుల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అందుకే వీటిని డైట్‌లో చేర్చుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకూ నల్ల నువ్వులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్‌ను తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో నల్ల నువ్వులు అద్భుతంగా సహాయపడతాయి. మరి ఇంతకీ కేశాలకు నల్ల నువ్వులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులను వేసుకుని వాటర్‌తో ఒక సారి వాష్ చేసుకోవాలి. కడిగిన నువ్వుల్లో ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న నువ్వులు వాటర్‌తో సహా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ నువ్వుల పేస్ట్ నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

Related News

ఇప్పుడు ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేస్తే గనుక నల్ల నువ్వుల్లో ఉండే ప్రత్యేకమైన సుగుణాలు హెయిర్ ఫాల్ సమస్యను క్రమంగా తగ్గించేసి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ వాడటం వల్ల వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా కూడా ఉంటుంది.

Related News