పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూ్స్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
భారతదేశ ప్రధాన దేశీయ నిఘా సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీగా ఉన్న పోస్టులకు IB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 362 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. డిసెంబర్ 14, 2025 నాటికి వయస్సును లెక్కిస్తారు. ఇతర వర్గాల అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీగా రూ.550 డిపాజిట్ చేయాలి. అదనంగా, జనరల్, OBC, EWS వర్గాల అభ్యర్థులు రుసుముగా రూ.100 డిపాజిట్ చేయాలి. SC, ST, PWBD, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల, మిగతా అభ్యర్థులందరూ మొత్తం రుసుము రూ.650 చెల్లించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.550 డిపాజిట్ చేయాలి.
ఎంపిక ప్రక్రియలో టైర్ 1, టైర్ 2 పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షకు పిలుస్తారు. జీతం పే లెవల్ 1 కింద నెలకు రూ. 18,000 నుండి రూ. 56,900 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

































