కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఇంజినీరింగ్ జాబ్స్.. తక్కువ కాంపిటీషన్.. అర్హులు వీరే

www.mannamweb.com


ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారీ స్థాయిలో ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి.

రాంచీలోని మెకాన్‌ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన సమాచారం:
ప్రొఫెషనల్‌ పోస్టుల సంఖ్య: 309.
  • డిప్యూటీ ఇంజినీర్: 87
  • ఇంజినీర్: 01
  • అసిస్టెంట్ ఇంజినీర్: 88
  • జూనియర్ ఇంజినీర్: 15
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04
  • డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10
  • ఎగ్జిక్యూటివ్: 01
విభాగాలు:
  • సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్‌, పర్చేజ్ అండ్‌ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్‌, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, రిఫ్రాక్టరీస్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హత:
  • సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
  • 15-06-2024 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు. వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు:
  • రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
  • ఆన్‌ లైన్
ఎంపిక విధానం:
  • విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
  • 10-07-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
  • 31-07-2024