వైద్య వృతి అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్య ఈ వృతిలో ప్రజలకు సేవ చేయాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కలిగిన స్థాయిలో నిలవలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. అందుకోసం ఎంత కష్టమైన ఈ వైద్య వృత్తి ఎంత కష్టమైన సరే ఇష్టంగా చదువుతుంటారు. మరీ కొందరు ఈ విద్య కోసం విదేశాల్లకు సైతం వెళ్లి లక్షలు, లక్షలు ఖర్చు చేసి చదువుతుంటారు. ఇలా చదువును పూర్తి చేసి డాక్టర్ గా మారిన వారు మంచి హాస్పిటల్ లో పనిచేయాలని, సొంతంగా హాస్పిటల్ ను పెట్టాలని ఆశపడుతుంటారు.
కానీ, గ్రామీణ, గిరిజన వంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడారు. కనీసం ఆ ప్రాంతాల్లో సేవలను అందించాలనే ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే.. అలాంటి ప్రాంతాల్లో సరైన సౌకర్యలు కానీ, కష్టనికి తగిన జీతం కానీ లభించదనే ఉద్దేశంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి అపోహలో ఉన్న వైద్యుల కోసం తాజాగా తెలంగాణ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. అక్కడ పనిచేసే వారికి భారీగా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
సాధారణంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి ఏ వైద్యులు కూడా అంతగా ఆసక్తి చూపించారు. దీని ఫలితంగా ఆ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గార్భిణిలు, వృద్ధులు వంటి వారు ఆనారోగ్యనికి గురైతే మెరుగైన వైద్యన్ని అందించే సదుపాయం కూడా లేకుండా పోయింది. అయితే ఈ సమస్యపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గిరిజన, గ్రామీణ ఆసుపత్రిల్లో పనిచేస్తున్న వైద్యుల జీతాలను భారీగా పెంచుతున్నట్లు బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. అంతేకాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే రెట్టింపు వేతనం 100% ఇన్సెంటివ్, గిరిజన ప్రాంతాల్లో అయితే 125% ఇచ్చేందుకు తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఆమోదం తెలిపారు.
ఇకపోతే ఈ భారీ వేతనాలతో పాటు వైద్య సేవలను కూడా మరీంత మెరుగుపరిచేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణంయంతో ఇటు వైద్యులతో పాటు గ్రామీణ,గిరిజన ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. జీతాల పెంపుతో డాక్టర్లు కూడా ఆ ప్రాంతల్లో వైద్య సేవలు అందించడానికి ఆసక్తి చూపిస్తారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుతాయి.