RCBపై 300 రన్స్ కొట్టడానికి కమిన్స్ భారీ వ్యూహం! టీమ్​లోకి ఆ రాక్షసుడు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఐపీఎల్-2024లో ఒక్కో జట్టును చిత్తు చేస్తూ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది సన్​రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టాప్ టీమ్స్​ను వణికించిన కమిన్స్ సేన.. ఇప్పుడు ఆర్సీబీని ఓ ఆటాడుకోవాలని ఫిక్స్ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య ఉప్పల్ వేదికగా రేపు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్​లో 250కు పైగా స్కోర్లు మూడుసార్లు బాది ఊపు మీద ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. ఆర్సీబీతో మ్యాచ్​లో 300 పరుగులే టార్గెట్​గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్​లో తమ లక్ష్యం మూడొందలు అని ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా చెప్పేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ వ్యూహమే పన్నాడని తెలుస్తోంది. ఏంటా వ్యూహం? అనేది ఇప్పుడు చూద్దాం..

ఆర్సీబీతో మ్యాచ్​లో నయా స్ట్రాటజీతో బరిలోకి దిగాలని కమిన్స్ ఫిక్స్ అయ్యాడట. సన్​రైజర్స్ టీమ్​లో బ్యాటర్లు అంతా ఫాస్ట్​గా ఆడుతున్నారు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ నెక్స్ట్ లెవల్ ఫామ్​లో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ వేగంగా రన్స్ చేస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్​లు ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ బ్యాట్ ప్రతాపం చూపిస్తున్నారు. అయితే ఒక్క ఎయిడెన్ మార్క్రమ్ మాత్రమే నార్మల్ గేమ్ ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నా.. సన్​రైజర్స్​లో ఉండే హిట్టర్స్ ముందు తేలిపోతున్నాడు. అందుకే మార్క్రమ్ స్థానంలో ఓ రాక్షసుడ్ని దింపాలని నిర్ణయించుకున్నాడట సారథి కమిన్స్. కివీస్ స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ ఫిలిప్స్​ను ఆడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాడట.

మార్క్రమ్ స్థానంలో విధ్వంసక ఆల్​రౌండర్ ఫిలిప్స్​ను ఆడించాలని కమిన్స్​తో పాటు ఎస్​ఆర్​హెచ్ మేనేజ్​మెంట్ డిసైడ్ అయిందని సమాచారం. స్లోగా ఆడుతున్న మార్క్రమ్ ప్లేస్​లో ఫిలిప్స్ వస్తే టీమ్​కు ఇంకో భారీ హిట్టర్ దొరికినట్లు అవుతుందని అనుకుంటున్నారట. హెడ్, అభిషేక్ ఎలాగూ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఫిలిప్స్ కూడా చెలరేగితే మిగతా పనిని క్లాసెన్, ఇతర బ్యాటర్లు చూసుకుంటారనేది కమిన్స్ ఆలోచనగా కనిపిస్తోంది. ఫిలిప్స్ టీమ్​లోకి వస్తే ఎక్స్​ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది. ఫీల్డింగ్​లో ఈ కివీస్ స్టార్ ఎంత తోపు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఉన్న విధ్వంసకారులు చాలక.. ఫస్ట్ బాల్ నుంచే విరుచుకుపడే రాక్షసుడ్ని తీసుకొస్తున్నారా? ఇక ఆర్సీబీ పని అంతే అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *