Hyderabad Metro: హైదరాబాద్లో నిలిచిన మెట్రో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

హైదరాబాద్ మెట్రో ఈరోజు (జనవరి 29) ఉదయం గంట పాటు ఆగిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో నాగోల్ టూ రాయదుర్గం రూట్ బ్లూ లైన్ లో అంతరాయం ఏర్పడింది.


అమీర్ పేట్, పెద్దమ్మ టెంపుల్ రూట్లో టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో గంట తర్వాత మెట్రో అధికారులు పునరుద్ధరించారు. ఇక, అప్పటి నుంచి నెమ్మదిగా నడుస్తున్న మెట్రో.. సిగ్నలింగ్ ఇష్యూ రావడంతో మెళ్లిగా వెళ్తున్న మెట్రో ట్రైన్స్.. సమస్యను క్లియర్ చేస్తున్నారు L&T అధికారులు. ఇంకా బ్లూ లైన్ రూట్ లో స్లోగా మెట్రో రైల్స్ నడుస్తున్నాయి.

అయితే, నాగోల్‌- సికింద్రాబాద్‌, మియాపూర్‌- అమీర్‌పేట రూట్లో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ.. నెమ్మదిగా కొనసాగుతుండటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ వేళలు కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో రద్దీ క్రమంగా పెరిగిపోతుంది. మరి కాసేపట్లో సిగ్నలింగ్ సమస్య పరిష్కారం అవుతుందంటున్న మెట్రో అధికారులు వెల్లడించారు.