భారతదేశ అద్భుతం.. పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు

www.mannamweb.com


భారతదేశ అద్భుతం.. పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సేవలతోపాటు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఉన్న ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ఇవి చేరుకుంటున్నాయి. 2026లో తొలి బుల్లెట్ రైలు ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయబోతోంది. దేశవ్యాప్తంగా రైళ్ల వేగం కూడా రోజురోజుకూ పెరుగబోతోంది. ఇటువంటి తరుణంలో మరో అద్భుతమైన ప్రాజెక్టును భారతీయ రైల్వే చేపట్టింది.

హర్యానాలో తొలి రైలు
ఈ ఏడాది తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రారంభించి 2047 సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా 50 హైడ్రోజన్ రైళ్లు నడపాలనేది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైళ్లు జర్మనీలో మాత్రమే నడుస్తున్నాయి. హైడ్రోజన్ రైళ్లు కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడటంతో ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు తొలి ప్రయాణం జరగనుంది. హైడ్రోజన్ అనేది స్థిరమైన ఇంధనం. ఆక్సిజన్, హైడ్రోజన్ ను కలిపి రైలులోని ఇంజన్ ను నడిపించే విద్యుత్తును సృష్టిస్తాయి.

ఈ రైలుకు ఎనిమిది బోగీలుంటాయి
మొదటి హైడ్రోజన్ రైలులో ఎనిమిది బోగీలుంటాయి. సాంప్రదాయం నడుస్తున్న రైళ్లతో పోలిస్తే ఈ రైళ్ల వల్ల కాలుష్యం తగ్గుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి ప్రమాదకరమైన కాలుష్య కారకాలు దీనివల్ల విడుదల కావు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో గ్రీన్‌హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్ లో ఈ రైలును నడిపేందుకు అవసరమైన పరికరాలు తయారు చేస్తున్నారు. వీటితోపాటు రీఫ్యూయలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేయడంతోపాటు, హైడ్రోజన్ కంప్రెసర్లు, రెండు హైడ్రోజన్ డిస్పెన్సర్లను ప్రీ-కూలర్ ఇంటిగ్రేషన్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల త్వరగా రైళ్లకు హైడ్రోజన్ ఇంధనాన్ని నింపొచ్చు.