నాకు భరణం చెల్లించాల్సిందే.. కోర్టు మెట్లెక్కిన భర్త..

 ప్రస్తుతం మ్యారేజ్ అనేది సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా మారిపోయింది. పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం.. భరణం పొందడం.. కామన్ అయిపోయింది.


అయితే ఈ భరణం కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు పురుషులు కూడా అర్హులే కదా.. భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తే వారు భరణం చెల్లించాలన్నప్పుడు.. తానెందుకు అలిమొనీ కోరకూడదనుకుని కోర్టు మెట్లెక్కాడు ఓ భర్త. బహుశా ఫస్ట్ టైమ్ ఇలాంటి కేసు నడుస్తుండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PCS అధికారి జ్యోతి మౌర్య భర్త ఆలోక్ మౌర్య హైకోర్టులో జీవనాధార భృతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హైకోర్టు జ్యోతి మౌర్యకు నోటీసు జారీ చేసింది. ‘నా భార్య PCS అధికారి.. నాకంటే చాలా ఎక్కువ సంపాదిస్తోంది. నా ఆదాయం చాలా తక్కువ. జీవనం సాగించడం కష్టంగా ఉంది. వైవాహిక వివాదం పరిష్కారం కాకముందు వరకు నాకు భృతి అందించాలి’ అని పిటిషన్ లో కోరాడు. కాగా ఈ పిటిషన్‌పై జస్టిస్ అరిందమ్ సిన్హా, డాక్టర్ వైకే శ్రీవాస్తవ బెంచ్ జ్యోతి మౌర్యకు నోటీసు పంపింది. తదుపరి విచారణ ఆగస్టు 8న జరుగుతుంది. ఇక దీనిపై స్పందించిన జ్యోతి మౌర్య… ‘ఆలోక్ స్వయంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. నేను పిల్లలతో ఉంటూ వారి చదువు ఖర్చులను భరిస్తున్నాను. అతనికి భృతి ఎందుకు కావాలి? కోర్టులో సమాధానం చెబుతాను’ అంటోంది.

గత వివాదం

జ్యోతి మౌర్య PCS అధికారిగా మారిన తర్వాత ఆమె, ఆలోక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆలోక్, జ్యోతి అధికారిగా మారిన తర్వాత తనను, తమ సంబంధాన్ని తిరస్కరించిందన్నాడు. ఒక హోమ్‌గార్డ్ కమాండెంట్‌తో ఆమెకు సంబంధం ఉందని కూడా ఆరోపించాడు. తాను చదివిస్తే ఎదిగి.. తనను రోడ్డున పడేసిందని బాధపడ్డాడు. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించబడింది. ఇక గతంలో ఫ్యామిలీ కోర్టులో భరణం పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పుడు ఆలోక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం ఇప్పుడు కేవలం వైవాహిక సమస్యగా మాత్రమే కాకుండా… చట్టపరమైన, సామాజిక చర్చా అంశంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.