వాస్తు లోపాలు గుర్తించండి.. ఇలా ఉంటే అన్నీ శుభాలే

వాస్తు ప్రకారం ఇంటికి అన్ని దిక్కులు ముఖ్యం. అయితే ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు నిపుణుల సలహా తీసుకోకపోయినా, అవగాహన లేకుండా కట్టినా పలు లోపాలు తలెత్తుతాయి.


వాస్తు ప్రకారమే ఇల్లు అద్భుతంగా కట్టుకున్నప్పటికీ బయట స్థలంలో కూడా కొన్ని లోపాలుంటాయి. ప్రధానంగా ఈశాన్యంలో కాంపౌండ్ కు వదిలేస్తారు. దీన్ని ఈశాన్యం లెస్ అని పిలుస్తారు. ఇలా చేస్తే తీవ్రమైన వాస్తు దోషం అవుతుంది. అది లెస్ అయితే దాదాపుగా ఇల్లు మొత్తం వాస్తు లెస్ గా మారుతుంది.

అంతేకాకుండా ఇంటి యజమాని ఆస్తులు కోల్పోవడం, ప్రమాదాలు జరగడం, ఇతర నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 100 శాతం వాస్తు అనుసరించి ఇల్లు కట్టుకున్నామని చాలామంది భావిస్తుంటారు. అయితే చిన్న చిన్న లోపాలు కూడా ఉండనే ఉంటాయి. వాటిని గమనించి సరిదిద్దుకోవాలి. లేదంటే అనేకరకాలుగా ఇంటి యజమాని నష్టపోవాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈశాన్యం లెస్ సమస్యను పరిష్కరించడానికి ఈశాన్యంలో గ్రిల్ లేదంటే గేటు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

బట్టలు ఆరేసుకోవడానికి ఏ భాగంలో వైర్లు కట్టినా ప్రతికూల ప్రభావాలు వస్తాయి.

వైర్లు కడితే వాటిని వెంటనే తొలగించాలి.

పట్టణాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్థలం ఉంటుంది

చాలామంది దాన్ని అలాగే వదిలేస్తారు.

ఖాళీ స్థలంలో అసమానతలుంటాయి.

తూర్పు, ఉత్తరంవైపు ఖాళీ స్థలం వదలకూడదు.

ఉత్తరంవైపు ఇంకా ఎక్కువగా ఖాళీస్థలం ఉంటే వచ్చిన డబ్బు నిలవకూడదు.

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.

తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో రెండు గేట్లు ఉండకూడదు.

రెండు గేట్లు ఉంటే ఈశాన్య భాగం లోపిస్తుంది.

ఒక గేటు మాత్రమే ఉండాలి.

ఈశాన్యంలో బావి, సంప్, నీటితో సంబంధం ఉన్నవి ఉండాలి.

అలా ఉంటే ఆ ఇంటికి తిరుగుండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.