కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే.. తెల్ల జుట్టు పోయి పొడుగ్గా పెరుగుతుంది

www.mannamweb.com


కర్పూరాన్ని చాలా వరకు పూజలకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంతో ఇంట్లో వాస్తు దోషాల్ని కూడా తొలగించుకోవచ్చు, అదే విధంగా చిన్న పాటి అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో కూడా యూజ్ చేస్తారు. కానీ కర్పూరంతో ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కర్పూరం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. కర్పూరంతో జుట్టు రాలడం, చుండ్రు, చిట్లడం, తెల్ల జుట్టును నల్లగా మార్చడం, జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరిగేలా చేయడంలో కూడా కర్పూరం చక్కగా పని చేస్తుంది. మరి కర్పూరాన్ని ఎలా ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యల్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్పూరాన్ని ఎలా ఉపయోగించాలి?

ముందుగా కర్పూరాన్ని పొడిలా తయారు చేసుకోవాలి. దీన్ని కొబ్బరి నూనెలో వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పెట్టి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?

కర్పూరం కలిపిన కొబ్బరి నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు రాత్రి సమయంలో జుట్టుకు పట్టించాలి. ఉదయం లేవగానే తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా రెండు నెలల పాటు చేయగానే మీ జుట్టులో ఖచ్చితంగా మార్పు గమనిస్తారు. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా, దృఢంగా తయారవుతుంది.

హెయిర్ వేగంగా పెరుగుతుంది:

కర్పూరం కలిపిన నూనెను తలకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గి.. వేగంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. రెట్టింపు వేగంతో జుట్టు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు షైనీగా మారుతుంది:

చాలా మంది జుట్టు నిర్జీవంగా ఉన్నట్టు కనిపిస్నతుంది. ఇలాంటి వారు కూడా జుట్టుకు కర్పూరం కలిపిన నూనె అప్లై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. తలపై ఉండే దుమ్మూ, ధూళిని తొలగించి జుట్టుకు కొత్త మెరుపును తీసుకొస్తుంది. జుట్టు మెత్తగా కూడా ఉంటుంది.
నల్లగా మారుతుంది:

చిన్నతనం నుంచే చాలా మందికి తెల్ల జుట్టు అనేది వస్తుంది. దీంతో నలుగురిలో తిరిగేందుకు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు కర్పూరం కలిపిన కొబ్బరి నూనె పట్టిస్తే.. కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)