జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే: పురందేశ్వరి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబ సభ్యులకు రోజురోజుకు దూరం పెరిగిపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హరికృష్ణ మరణించిన తర్వాతే ఈ దూరం బాగా ఎక్కువవుతోంది. ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నవారు కేవలం కల్యాణ్ రామ్ ఒక్కరే. రాష్ట్రంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్న సమయంలో కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందించలేదు. బాలయ్యతో కూడా విభేధాలున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది నందమూరి కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్ కు మధ్య సయోధ్య కుదురుతుందా? లేదా? అనే దీనికి ఎవరి దగ్గరా సమాధానం లేదు.


అది తారక్ వ్యక్తిగత నిర్ణయం తాజాగా ఎన్టీఆర్ మేనత్త, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అయిన దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ పేరును యాంకర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్టీఆర్ కు, నందమూరి కుటుంబానికి దూరం ఉన్న విషయం వాస్తవమేనని, అయితే ఇప్పుడు ఆ దూరం లేదని, అందరూ కలిసిపోయారని చెప్పారు. తారక్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తారా? అన్న ప్రశ్నకు పురందేశ్వరి సమాధానమిస్తూ అది ఎన్టీఆర్ వ్యక్తిగత నిర్ణయమన్నారు. తనది చాలా చిన్న వయసని, వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడని, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యాడని, దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడన్నారు. ఇటువంటి సమయంలో రాజకీయాల గురించి ఆలోచించే తీరిక ఎన్టీఆర్ కు ఎక్కడుంటుందన్నారు.

ఆప్యాయంగా అత్తా అని పిలుస్తాడు రాజకీయాలకు సంబంధించి తామెప్పుడూ మాట్లాడుకోలేదన్నారు. తన సినిమా విడుదలకు దగ్గరగా ఉన్న సమయంలో తన పిల్లలు వెంటనే ఫోన్ చేసి ఆ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షులు చెబుతారని చెప్పారు. తనను ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా అత్తా అని పిలుస్తాడని, తనతో మొదటినుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని పురందేశ్వరి చెప్పారు. మొదటి నుంచి ఫోన్ లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటామని, వీలైనప్పుడు కలుస్తుంటామన్నారు. ఎన్టీఆర్ నటన పరంగా అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ఎన్టీఆర్ నటించిన వార్2 సినిమా విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది వేసవికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ విడుదల కానుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.