40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. అధికారిక ప్రకటన

స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు.. పేరున్న దర్శకుడు కూడా కాదు.. అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సులు లేవు.. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా లేవు. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు.


అయితేనేం చిన్న గా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిందీ మూవీ. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ చిత్రం 200 థియేటర్లలో పైగా 50 రోజులు ఆడింది. అంతేకాదు రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న ఈమూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరపడింది. మరికొన్ని గంటల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇంతకు మనం ఏ గురించి మాట్లాడుకుంటున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.

మహా విష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ యానిమేటెడ్ మూవీ శుక్రవారం (సెప్టెంబర్19)న ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ యానిమేటెడ్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్ నరసింహాఈచిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా నిర్మించారు. జులై 25న విడుదలైన ఈ మూవీ భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ గా రికార్డుల కెక్కింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు కూడా ఈ ను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.