సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్ర లేకపోవడం మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఇది కొన్ని లక్షణాల ద్వారా..
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్ర లేకపోవడం మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఇది కొన్ని లక్షణాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం వాటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైతే సమస్య తీవ్రంగా మారవచ్చు. అందువల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి 7 నుంచి 8 గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. కాబట్టి సరైన నిద్ర లేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మన ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది? ఏ వ్యాధులు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
మెదడుకు చేటు
రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వ్యక్తులు క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఒక అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది.
మలబద్ధకం సమస్య
నిద్ర లేకపోవడం జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడతారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే పేగు సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది.
జ్ఞాపకశక్తి బలహీనత
శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.
మానసిక ఆరోగ్యం క్షీణత
నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో శక్తి, బలం వేగంగా తగ్గుతుంది. ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తుంది. అంతేకాదు నిద్ర లేమి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది చిరాకు, కోపాన్ని పెంచుతుంది. ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సరిగ్గా నిద్రపోనప్పుడు ఈ లక్షణమే మొదట కనిపిస్తుంది.
కంటి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు
నిద్ర లేకపోవడం కూడా కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి శరీరంలో గణనీయంగా పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.
































