ఈ చెట్టు కాయను దంచి తలకు పట్టిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!

ఆహారం, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా చాలా మంది అకాలంగా జుట్టు నెరిసిపోవటం, రాలిపోవటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది చాలా రకాల ట్రీట్‌మెంట్లు పాటిస్తుంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మార్కెట్‌లో దొరికే వివిధ రకాలైన రసాయనాలతో కూడి హెయిర్‌ డైలు వాడుతుంటారు. కొందరు తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి వంటింటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు చాలా మంది తెల్ల జుట్టు, జుట్టు రాలిపోయే సమస్యను పరిష్కరించేందుకు గానూ సతమతమవుతున్నారు. అందుకోసం వేల వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు కూడా. అయితే మీరు జుట్టు సమస్యలకు ఉసిరికాయ, షికాకాయ్ పొడిని ఉపయోగించవచ్చు. ఇది మీ గ్రే హెయిర్ ని సహజంగా నల్లగా మారుస్తుంది.

ఉసిరి..

Related News

ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ మీ జుట్టు సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. మీ హెయిర్‌ కేర్‌ రోటీన్‌లో ఉసిరిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీరు అందమైన, పొడవాటి, మెరిసే జుట్టును పొందగలుగుతారు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్‌ ఇ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరి అకాల జుట్టు నెరుపును దూరం చేస్తుంది.

విధానం: నాలుగైదు ఉసిరికాయలను తీసుకుని వాటిని ముందుగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్‌ను మీ తలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీ జుట్టును శుభ్రంగా వాష్‌ చేసుకోండి. ఇది జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చుండ్రు నయం అవుతుంది. అంతే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఉసిరి పొడిని కూడా ఉపయోగించవచ్చు.

బ్లాక్ టీ..

బ్లాక్ టీ మీ జుట్టును నల్లగా చేసి చక్కని మెరుపును ఇస్తుంది. ఇది కూడా మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

విధానం: ఒక కప్పు నీరు తీసుకుని మరిగించాలి. వేడినీటిలో రెండు టీస్పూన్ల టీ ఆకులను వేయాలి. ఇప్పుడు ద్రావణంలో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు అంతటా బాగా పట్టించాలి. ఈ ద్రావణాన్ని మీ జుట్టులో సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై సాధారణ నీటితో మీ జుట్టును కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయండి. మీ జుట్టు సమస్యలు తీరిపోతాయ్‌. దీంతో మీ కేశాలు ఆరోగ్యంగా, అందమైన మెరిసే జుట్టును పొందుతారు.

మెంతిపొడి, ఉసిరి పొడి, నిమ్మరసం..

మెంతులు, ఉసిరి జుట్టు సమస్యలకు చక్కటి చికిత్సగా పని చేస్తుంది. ఈ రెండు కూడా మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది.

విధానం: రెండు టీస్పూన్ల ఉసిరి పొడి, రెండు టీస్పూన్ల మెంతిపొడి తీసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీరు, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపండి. బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

Related News