ఈ లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్లేనట.. విస్మరిస్తే మొదటికే మోసం

www.mannamweb.com


మధుమేహం ఉన్నవారిలో తరచూ నోరు పొడిబారుతూ ఉంటుంది. నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

పొడిబారిన నోరు మధుమేహంకు ఒకహెచ్చరిక సంకేతం. అదనంగా నోటిలో లాలాజలం తక్కువైతే మీ దంతాలు, చిగుళ్ళలో సమస్యలకు దారితీస్తుంది.

మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిది. నిర్లక్ష్యం చేసి వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. యువకుల్లో షుగర్‌ తాలూక మొదటి లక్షణం అధిక దాహం. అతిగా మూత్రవిసర్జన.

అలాగే, షుగర్‌ ఉన్న వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ వ్యాధితో బాధపడేవారు అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. కంటి చూపు స్పష్టత తగ్గితే షుగర్ వచ్చినట్టే అంటున్నారు నిపుణులు. చిన్న పనులు చేసి అలసిపోతారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు మానసిక ఆందోళనతో ఉంటారు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మీరు శ్వాస తీసుకునేటపుడు ఏదైనా పండిన వాసన పీల్చుతున్న అనుభూతి కలిగి ఉంటే, అది మధుమేహానికి సంబంధించిన ఒక సైడ్ ఎఫెక్ట్‌ అంటున్నారు నిపుణులు. వికారంగా అనిపించడం, తలతిరగడం కూడా మధుమేహానికి సంకేతంగా చెబుతున్నారు. కాళ్లలో తీవ్రమైన నొప్పి అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతినవచ్చు. అలాగే, ఏదైనా గాయం అయినపుడు అది మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటే కూడా మధుమేహానికి సంకేతం.