జర్నీ చేస్తే ఇలాంటి బస్సులోనే చెయ్యాలి.. అత్యాధునిక సదుపాయాలతో ఓల్వో బస్సులు

www.mannamweb.com


ప్రయాణికులకు తమ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కర్నాటక ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో కూడిన బస్సులను అందుబాటులోకి తేనుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇవి ఎంతో అనుకూలాంగా ఉండేలా అధునాతన సౌకర్యాలతో కూడిన 9600 ఓల్వో మల్టీ యాక్సిల్‌ సీటర్‌ ఫ్రూటో తరహా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. బస్సుల ప్రత్యేకతలను రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. శక్తి వంతమైన హ్యాలోజిన్‌ హెడ్‌లైట్, డే రన్నింగ్‌ లైట్‌లతో పాటు లోపల విలాసవంతమైన డిజైన్లతో కూడిన ఈ బస్సును నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. అధిక వేగం, మైలేజ్‌తో పాటు ప్రయాణికులు కూర్చునే సీట్ల మధ్య సౌకర్యంగా ఖాళీ ఉంటుంది. అగ్నిప్రమాదాల నియంత్రణకు ఫైర్‌ అలారమ్, రక్షణ వ్యవస్థ వంటివి అమర్చారు. మంగళూరు, కుందాపుర, మైసూరు, శివమొగ్గ, చిక్కమగళూరు, హైదరాబాద్, విజయవాడ, ముంబయి, షిరిడీ, చెన్నై, ఎర్నాకులం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నారు. ఇందుకోసం తొలి విడతగా 20 బస్సులు కొనుగోలు చేయనున్నారు.