ఒంటె పాలు తాగితే షుగర్‌ పూర్తిగా కంట్రోల్‌ అవుతుందా..?

మధుమేహంతో బాధపడే వారి సంఖ్య నేడు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఒక్కటే రాదు.. రోగం ఎక్కువయ్యే కొద్ది.. బోనస్‌గా కళ్లు, కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది. కొన్నాళ్లకు గుండె కూడా. ఇలా శరీరంలో ఒక్క అవయవాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని చివరికి ప్రాణాంతకం చేసే భయంకరమైన జబ్బు డయబెటిస్. ఇది కాయిన్‌కు ఒక సైడ్‌ మాత్రమే.. మీరు మధుమేహం ఆటలు కట్టించాలంటే.. ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్‌ చేయాలి. ఎలా అయితే ఇప్పుడు కొంతమంది భార్యలు భర్తలను కంట్రోల్‌ చేస్తారో అలా..!! అప్పుడే దాని ఆటలు సాగవన్నట్లు.! అయితే శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఒక అసాధార‌ణ‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ర‌క్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వెల్ల‌డైంది. ఈ ఆహారం సంచార జీవ‌నం చేసే వారికి ప్ర‌ధాన ఆహారంగా ఉంటుంది. ఆ ఆహారం మ‌రేమిటో కాదు ఒంటె పాలు. ఒంటె పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మ‌న దేశంలో వీటి వాడ‌కం ఎక్కువ‌గా లేన‌ప్ప‌టికి గ‌ల్ఫ్ దేశాల్లో ఒంటె పాలను ఎక్కువ‌గా ఉపయోగిస్తారు. ఒంటె పాలు, అలాగే పాల పొడి ఆన్ లైన్‌లో విరివిరిగి ల‌భిస్తాయి. ఒంటె పాలల్లో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఒంటె పాల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు యాంటీ మైక్రోబ‌యాల్ గుణాలు కూడా ఉన్నాయి. ఆవు పాలల్లో , ఒంటె పాలల్లో దాదాపు స‌మాన‌మైన పోష‌కాలు ఉన్న‌ప్ప‌టికి ఒంటె పాలల్లో విభిన్న ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు క‌నుగొన్నారు. ఒంటె పాలల్లో విట‌మిన్ సీ తో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన ఖ‌నిజాలు ఉన్నాయి. అలాగే ఒంటెపాలు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యే గుణాన్ని కూడా క‌లిగి ఉన్నాయి. అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను త‌గ్గించ‌డంలో ఒంటెపాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయని నిపుణులు క‌నుగొన్నారు.

ఒంటె పాల‌ల్లో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నాయ‌ని అందుకే ఇవి డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4 క‌ప్పుల ఒంటె పాలు 52 యూనిట్ల ఇన్సులిన్‌తో స‌మాన‌మైన‌ద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి ఒంటె పాలు ఇచ్చి జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు రోజుకు 500 ఎమ్ ఎల్ ఒంటె పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒంటె పాలల్లో ఇన్సులిన్ నానో పార్టిక‌ల్స్ రూపంలో ఉంటుంది. ఇది చిన్న ప్రేగు ద్వారా త్వ‌ర‌గా గ్ర‌హించ‌బ‌డి త్వ‌ర‌గా ర‌క్తంలో క‌లుస్తుంది.
ఈ పాలల్లో ఉండే లైసోజెమ్, లాక్టోఫెర్రిన్ అనే ఎంజైమ్లు కూడా మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో అవ‌స‌రం. ఒంటె పాల‌ను తాగ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉండ‌డంతో పాటు వీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *