కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి కాలంలో యువత కూడా అనేక రకాల గుండె జబ్బుల బారీన పడుతున్నారు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో అధిక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా పలురకాల పానీయాలు గుండె ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మీరు ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తాగితే మాత్రం ఆయుర్దాయం తగ్గిపోతుంది. సమయాభావం వల్ల చాలా మంది పండ్ల రసాలను కొని తాగుతుంటారు. ఈ తప్పు చేయవద్దు.
అందుకే ఇంట్లోనే పండ్ల రసాన్ని తయారు చేసుకోవడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో చక్కెర అధికంగా ఉండటంతోపాటు ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానికరం.
మార్కెట్లో వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. కొందరైతే తక్కువ క్యాలరీలు కలిగిన ఉంటాయని, వాటిలో చక్కెర ఉండదని చెబుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎనర్జీ డ్రింక్స్ ఎప్పుడూ పోషకమైనవి కావు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలేవీ ఉండవు.
అలాగే శీతల పానీయాలు రుచికి సంతృప్తికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం. ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది గుండెకు కూడా హానికరం. అలాగేమద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.