రోజూ ఒక ఉసిరికాయ తింటే.. మీ బాడీలో జరిగే మార్పులివే

త్వరలో కార్తికమాసం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉసిరికాయల సందడి మొదలుకానుంది. ఉసిరి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలిసిన విషయమే. ఉసిరిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.


వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను రకరకాలుగా తీసుకుంటారు. జ్యూస్ తాగినా, ఎండబెట్టి వరుగులు చేసినా, మురబ్బా తయారు చేసినా, రోటి పచ్చడి అయినా, ఇలా ఏ ఐటెమ్ చేసుకున్నా అందులో పోషక విలువలు పదిలంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరిలో ముఖ్యంగా విటమిన్‌ సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరొటిన్, బీ- కాంప్లెక్స్‌ తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయట. వీటిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణుల మాట. అలాగే ఇది చర్మంలో కొల్లాజెన్ ఏర్పడడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అలాగే ఉసిరికాయలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ లెవల్స్, రక్తపోటును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. అంతేకాక షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరికాయలు దివ్య ఔషధంగా పనిచేస్తాయట. ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుందని.. ఇవి గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.