పైనాపిల్‌ తింటే మార్పు మీ ఊహకు కూడా అందదు.. ముఖ్యంగా

www.mannamweb.com


ఊబకాయం.. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. రోజురోజుకీ ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది.

మారుతోన్న జీవన విధానం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో బరువు పెరుగుతున్నారు. అయితే పెరిగిన బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

జీవన విధానంలో మార్పులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం తగ్గిస్తుంటారు. వర్కవుట్స్‌ పేరుతో జిమ్‌ల్లో కుస్తీలు పడుతుంటారు. అయితే వీటన్నింటితో పాటు పైనాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. పైనాపిల్‌ బరువు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పైనాపిల్ ద్వారా కలిగే మరికొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకోవడం వల్ల రోజుకు మొత్తానికి కావాల్సిన విటమిన్‌ సి లభించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మతులోనూ విటమిన్‌ సి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి. దీంతో త్వరగా వృద్ధాప్యం రాకుండా చూస్తుంది.

ఇక క్యాన్సర్‌, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే రోజూ పైనాపిల్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారిలో కూడా పైనాపిల్‌ దిద్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఇందులోని ఫైబర్‌ కంటెంట్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం దరిజేరకుండా చేస్తుంది. పైనాపిల్‌లో మాంగీస్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలతో శరీరానికి అవసరమైనంత మాంగనీస్‌ లభిస్తుంది. ఇది చర్మం నిగనిగలాడే చేయడంలో ఉపయోడపడుతుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండానూ కాపాడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.