తులసి, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయ, పసుపు వంటి పదార్థాలు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇవి శ్వాసకోశాన్ని ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడి, శ్వాసక్రియను సులభతరం చేస్తాయి.
మనం జీవించి ఉన్నామని చెప్పడానికి ప్రధాన సాక్ష్యం మన శ్వాసే. శ్వాసక్రియ అంటే కేవలం గాలిని పీల్చుకొని వదిలేయడమే కాదు.. మన ప్రాణాన్ని ప్రతి క్షణం నిలబెట్టుకునే ప్రక్రియ. ఒక్కసారిగా, ఈ శ్వాస తీసుకోవడం ఆగిపోతే ప్రాణమే ఉండదు. అయితే, శ్వాసలో దుమ్ము, ధూళి, పొగ నిండివుంటే శ్వాసక్రియలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. నేటి కాలుష్యం, స్మోకింగ్ హ్యాబిట్, కిచెన్ స్మోక్ వంటివి మన ఊపిరితిత్తులను (Lungs) ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
శరీరాన్ని ఫిల్టర్‌లా ఉపయోగపడే ఊపిరితిత్తులు ధూళితో నిండిపోతే శ్వాస భారంగా అనిపించడం, అలసట, దగ్గు, ఇతర అనారోగ్యాలు వస్తుంటాయి. లంగ్స్‌ని శుభ్రం చేసుకుంటే తప్ప ఈ సమస్యలు పోవు. ఇందుకు 5 పదార్థాలు బాగా పనికొస్తాయి. అవేంటంటే..
తులసి
ఆయుర్వేదంలో తులసి (Basil)కి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ఊపిరితిత్తులకు అమృతంలా భావిస్తారు. ఇందులో ఉండే యూజినాల్ (Eugenol) అనే ఎలిమెంట్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. శ్వాసకోశాన్ని సైతం శుభ్రంగా ఉంచుతుంది. రోజూ ఏదో ఒక సమయంలో తులసి ఆకులు తింటే ఊపిరితిత్తుల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అవసరమైతే తులసి టీ తాగొచ్చు. తులసి రసంలో తేనెను సైతం యాడ్ చేసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
అల్లం
అల్లం (Ginger) ఊపిరితిత్తులను క్లీన్ చేసే నేచురల్ రెమెడీ. ఇందులోని జింజెరాల్ అనే సమ్మేళనం పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది లంగ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. శ్వాసనాళంలో, లంగ్స్‌లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని సైతం బయటకు పంపిస్తుంది.
ఇలా బ్రీతింగ్‌ని సులభతరం చేస్తుంది. రెగ్యులర్‌గా వండే వంటల్లో అల్లం పేస్ట్ వాడటం మంచిది. అల్లంతో టీ (Ginger Tea) చేసుకుని తాగినా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రోజూ కొద్దిగా పచ్చి అల్లం తిన్నా మంచిదే. తేనె (Honey)తో కలిపి తీసుకుంటే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అల్లం టీలో షుగర్‌కి బదులు తేనెను కలుపుకొని తాగొచ్చు.
వెల్లుల్లి
ఊపిరితిత్తులు, శ్వాసనాళం వెంబడి పేరుకుపోయిన శ్లేష్మాన్ని వెల్లుల్లి (Garlic) విచ్ఛిన్నం చేస్తుంది. ఇది లంగ్స్‌ని క్లీన్ చేయడంతో పాటు బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. ఇందులోని అల్లిసిన్ అనే కాంపౌండ్ నేచురల్ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినొచ్చు. తేనె కూడా యాడ్ చేస్తే మరీ మంచిది.
నిమ్మకాయ
నిమ్మకాయ (Lemon)లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు లంగ్స్‌ని డీటాక్సిఫై చేస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే లంగ్స్‌కి మంచిది. అవసరమైతే ఇందులో తేనె సైతం యాడ్ చేసుకోవచ్చు. ఇవి శ్వాసనాళం వెంబడి పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటకు పంపిస్తుంది. లెమన్ టీ కూడా ట్రై చేయొచ్చు.
పసుపు
పసుపులో (Turmeric) కుర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్. ఇది ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి క్లీన్ చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు బాడీని డీటాక్సిఫై చేయగలవు. గోరువెచ్చని నీటిలో పసుపు, నిమ్మరసం కలిపితే అది డీటాక్స్ డ్రింక్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు టర్మరిక్ మిల్క్ (Turmeric Milk) తాగితే ఉదయం శ్వాసనాళం పరిశుభ్రంగా ఉంటుంది.
































