ఈ ఆకు తింటే చాలు కిడ్నీలో కంకరరాయి ఉన్నా కరగాల్సిందే

www.mannamweb.com


ఈ రోజు మనం ఎంతో విశేషమైన ఒక మిరాకిల్ మొక్క గురించి తెలుసుకుందాం.. అదే రణపాల మొక్క. ఈ మొక్కను ఆకు మొక్క అని కూడా పిలుస్తారు. దీనికి ఒక విశిష్టత ఉంది.

అదేమిటంటే అన్ని మొక్కలు వేరు నుంచి.. కాండం నుంచి… విత్తనం నుంచి వస్తాయి. కానీ ఈ చెట్టు ఆకు కణుపుల నుండి కొత్త చెట్లు మొలుస్తాయి.

ఒక ఆకుని మట్టిలో పూడ్చి పెడితే ఐదు మొక్కలు వరకు వస్తాయి. ఈ మొక్క ఆకు పండిన తరువాత రాలిన ఐదు మొక్కలకి ప్రాణం ఇస్తుంది. ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రధాన సమస్య తెల్లజుట్టు, జుట్టు రాలిపోవడం. ఈ ప్రాబ్లంతో బాధపడే వారు ఈ రణపాల ఆకుని గుజ్జులాగా చేసి జుట్టుకి రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అదేవిదంగా షుగర్, బిపితో బాధపడేవారు ఈ ఆకులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల తొందరగా ఆ సమ్యలకు చెక్ పెట్టవచ్చు. అదే విధంగా చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా సెగ గడ్డలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ ఆకును మెత్తగా దంచి ఆ గడ్డలపై పెట్టడం వల్ల తొందరగా తగ్గిపోతాయి. ఇంకా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఈ ఆకు రసంను పరగడుపున రెండు స్పూన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి, మూత్రంలో పడిపోతాయి. అదే విదంగా కిడ్నీలను శుభ్రం చేసి వ్యర్థ పదార్థాలను తొలగించి, కిడ్నీలకు పునర్జీవం తెస్తాయి. అలాగే అసిడిటీ సమస్యతో బాధపడే వారు ఈ ఆకుని నోట్లో వేసుకుని చిన్నగా నమిలి ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగటం వల్ల ఉపశమనం పొందుతారు.

అలాగే తలనొప్పి, ఆస్తమా ఉన్నవారు ఈ ఆకు రసం పావు స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆస్తమా తొందరగా తగ్గుతుంది. ఈ రణపాల ఆకు మీద కొబ్బరి నూనె రాసి స్టవ్ మీద ఆకుని రెండు వైపులా వేడిచేసి ఎలాంటి నొప్పి ఉన్నా సరే దానిపై వేసుకొని కట్టుకట్టుకోవాలి. ఇలా మూడు రోజులు.. రోజుకి రెండు,మూడు సార్లు కట్టిన తర్వాత ఎలాంటి నొప్పులు అయినా సరే.. మోకాళ్ళ నొప్పులు అయినా సరే కింద పడ్డప్పుడు గట్టిగా తగిలిన దెబ్బల నొప్పులు నుంచి అయినా సరే రిలీఫ్ పొందుతారు.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)