దీర్ఘాయువుగా, ఆరోగ్యంగా జీవించాలనేది దాదాపు మనందరి కోరిక. కానీ, నేటి ఆధునిక జీవనశైలి, వైద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పొందలేము. మన జీవిత రహస్యం మన చేతుల్లోనే ఉన్నట్లుగా, మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఆనందం వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మహా భాగ్యం అనే సామెత ప్రకారం..ఆరోగ్యకర అంశాలు దీర్ఘాయువుకు ముఖ్యమైన ఆధారం. అయితే, ఇక్కడ ఒక్క ఆశ్చర్యకర అంశం ఏంటంటే..ఇటీవలి ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అదేంటంటే..
గత కొంతకాలంగా 100 ఏళ్ల వయసున్న వారి సంఖ్య పెరుగుతోందని ఓ సర్వేలో తేలింది. 2000లో ప్రపంచవ్యాప్తంగా 1,51,000 మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ఇది 2021 నాటికి 5,73,000కి పెరుగుతూ వచ్చింది. ఇది పెరిగిన ఆయుర్దాయం విషయాన్ని తెలియజేస్తుంది. వందేళ్లు దాటిన వారి ఆరోగ్యం, విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణలుగా కనిపిస్తారు. వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే అతి తక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి 90 ఏళ్లలో వ్యాధి లేకుండా జీవిస్తూ వచ్చారు.. తక్కువ మందులు తీసుకుంటున్నారు. ఇక చిన్న వయస్సులో చాలా చురుకుగ్గా ఉండేవారు. వారి దీర్ఘాయువులో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తున్నప్పటికీ, 60శాతం మంది వందేళ్లు నిండిన వృద్ధులు తమ దీర్ఘాయువు రహస్యంలో కొన్ని జీవనశైలి మార్పులే ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు.
2000 నుండి ప్రచురించబడిన 34 అధ్యయనాల పరిశోధనలో వందేళ్లు పైబడిన వారు ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఔషధ వినియోగం, సరైన నిద్ర, పనివేళలు ఎక్కువ దీర్ఘాయువుకు సహాయపడే నాలుగు కీలక పద్ధతులను వివరిస్తుంది. వారంతా 100 సంవత్సరాల వయస్సు వరకు తన జీవనశైలిని ఎలా గడిపారు, అతని ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
నూరేళ్లకు మించి ఆరోగ్యంగా జీవిస్తున్న వృద్ధులు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే 57శాతం నుంచి 65శాతం వరకు మితమైన కొవ్వు, ప్రోటీన్ వంటివి తీసుకున్నారు. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రొటీన్లు, చేపలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తరచుగా వారి ఆహారంలో అలవాటుగా చేసుకున్నారు. అంతేకాదు.. వారు ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటారు. అంతేకాదు.. ఇతరులతో పోలిస్తే..వందేళ్లు దాటిన వారిలో వ్యాధుల ప్రభావం తక్కువగా ఉంటుంది. దీంతో మందుల వాడకం కూడా తక్కువ. ఇది మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
అలాగే, మంచి నిద్ర కూడా దీర్ఘాయువుకు తోడ్పడుతుంది. 68శాతం శతాబ్ధి వయస్సు గలవారు సంతృప్తికర నిద్రను పొందుతారు. 7 నుండి 8 గంటల మంచి నిద్ర దీర్ఘాయువు రహస్యం. అందుకే మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం అనేది ఇప్పటికీ వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇక, వీరిలో దాదాపు 75శాతం మంది నూరేళ్లకు పైబడిన వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో తక్కువ ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులకు అసలు అవకాశం లేదని తేలింది. ఇలాంటి ముఖ్యమైన పద్ధతులు ప్రతి ఒక్కరికీ దీర్ఘాయువును ప్రసాదించలేకపోయినప్పటికీ..ఇలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దీర్ఘాయువు అవకాశాలను పెంచడంలో దోహదపడతాయన్నది నిజం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.