వామ్మో.. ఈ నాలుగు సమస్యలుంటే ఆపిల్ ముక్క కూడా తినకూడదంట..! జాగ్రత్త గురూ.

www.mannamweb.com


ఒక్క ఆపిల్ పండు వేల వ్యాధులకు శత్రువు.. అందుకే.. ప్రతిరోజూ తినాలని సలహా ఇస్తుంటారు. రోజూ ఒక్క ఆపిల్ తింటే వైద్యుల దగ్గరకు వెళ్లే అవసరమే రాదంటారు..

యాపిల్స్ శరీరంలోని అనేక కణాల ఏర్పాటుకు అవసరమైన కొన్ని మూలకాలను కూడా కలిగి ఉంటాయి. ఆపిల్ విటమిన్ సి, ఫైబర్, పొటాషియంతో సహా అనేక అద్భుతమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఆపిల్స్‌లో పెక్టిన్ వంటి ప్రయోజనకరమైన ఫైబర్ కూడా ఉంటుంది. అందుకే.. రోజుకో ఆపిల్ తింటే క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఆపిల్ అనేక వ్యాధులతో పోరాడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆపిల్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే, అతని ఆరోగ్యం క్షీణించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కానీ ప్రతిదీ మంచి.. చెడు ప్రభావాలను కలిగి ఉంటుందని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆపిల్ ఎప్పుడు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

పేలవమైన జీర్ణక్రియ: ఆపిల్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. కానీ జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నట్లయితే దీనిని ఎప్పుడూ తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, తిమ్మిర్లు వంటివి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచిది.

మధుమేహం: డయాబెటిక్ పేషెంట్లు యాపిల్ తినకూడదు. ఇది అధిక మొత్తంలో చక్కెరను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది.

ఊబకాయం: కొన్ని పండ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.. మరికొన్ని స్థూలకాయాన్ని పెంచుతాయి. ఆపిల్ పండ్ల వినియోగం ఊబకాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో చాలా కేలరీలు, చక్కెర ఉంటాయి.

అలర్జీలు: కొంతమందికి ఆపిల్ తినడం వల్ల కూడా అలర్జీ రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఆపిల్ తిన్న తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు లేదా వాపులు కనిపిస్తే, దాని వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలి.