రూ.1 లక్ష పెడితే రూ.20 లక్షల లాభం.. జీవితాన్నే మార్చేసిన స్కీమ్స్‌

ఈ రోజుల్లో డబ్బు సంపాదించేందుకు రకరకాల మార్గాలున్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు వచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. స్కీమ్స్ మాత్రం కేవలం లక్షతోనే 20 లక్షల రూపాయల వరకు లాభాలు తెచ్చి పెట్టింది.


ఇందు కోసం చాలా మంది ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ మ్యూచవల్ ఫండ్స్ ఎంచుకుంటుంటారు. ఈ ఫండ్స్ తమ పెట్టుబడులను లార్జ్, స్థిరమైన వృద్ధి గల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పెద్ద కంపెనీలు మార్కెట్ అనిశ్చితులు, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల్లోనూ బలంగా నిలబడగలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బలమైన బ్యాలెన్స్ షీట్లు, బలమైన మేనేజ్‌మెంట్, స్థిరమైన నగదు నిర్వహణ ఉన్న కంపెనీల్లోకి వెళ్తాయి.

గత 20 సంవత్సరాల్లో రెండు ఫండ్స్ హైరిటర్న్స్ అందించాయి. ఇన్వెస్టర్ల సంపదను 20 రెట్లు పెంచాయి. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.20 లక్షలు అందించాయి. ఫండ్స్ ఇండియా, ఏస్ ఎంఫ్ రీసర్చ్ డేటా ప్రకారం.. గత 20 ఏళ్లలో దేశంలోనే కేవలం 2 ఫండ్స్ మాత్రమే ఇన్వెస్టర్ల సంపదను 20 రెట్లు పెంచాయి. అవే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ రూ.1 లక్షల పెట్టుబడిని 20 ఏళ్లలో రూ.20 లక్షలు చేశాయి. గత 20 ఏళ్లలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ 21.1 రెట్లు రిటర్న్స్ అందించింది.

ఈ స్కీమ్ సీఈజీఆర్ రేటు 16.5 శాతంగా ఉంది. అంటే ప్రతి ఏడాది 16.5 శాతం చొప్పున రిటర్న్స్ అందిస్తూనే వచ్చింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ 20 ఏళ్లలో 20.1 రెట్ల మేర లాభాలు అందించింది. ఈ స్కీమ్ సీఏజీఆర్ రేటు 16.2 శాతంగా ఉంది.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ గత 10 ఏళ్లలో మంచి రాబడులే అందించింది. ఈ స్కీమ్ 10 ఏళ్ల సీఏజీఆర్ రేటు 12.60 శాతంగా ఉంది. ఇన్వెస్టర్ల సంపదను 3.3 రెట్లు పెంచింది. ఇక 15 ఏళ్లలో సీఏజీఆర్ రేటు 13.30 శాతంగా ఉండగా పెట్టుబడులను 6.5 రెట్లు అందించింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ చూసుకుంటే గత 10 ఏళ్ల సీఏజీఆర్ రేటు 13.10 శాతంగా ఉంది. పెట్టుబడులను 10 ఏళ్లలో 3.4 రెట్లు పెంచింది. అలాగే గత 15 సంవత్సరాల రాబడులు చూస్తే సీఏజీఆర్ రేటు 12.60 శాతంగా ఉండగా పెట్టుబడిని 5.9 రెట్లు పెంచింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.