కలబంద మొక్క ఇంట్లో వికసిస్తే ఆ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. కలబంద పువ్వును శుభ సంకేతంగా భావిస్తారు. అందువలన ఎవరి ఇంట్లోనైతే ఈ మొక్క ఉంటుందో, ముఖ్యంగా ఇది వికసిస్తుందో, వారికి సకల సౌభాగ్యాలు కలగడమే కాకుండా, ఆ ఇంట సిరి సంపదలు వెల్లి వెరుస్తాయంట.
కలబంద మొక్క ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో వారి ఇంట్లో అది ప్రతి కూలశక్తిని దూరం చేసి, అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అంతే కాకుండా ఎవరి ఇంట్లోనైతే కలబంద పుష్ప వికసిస్తుందో, వారు దానిని ఎర్రటి వస్త్రంలో చుట్టి, మీ ఇంటిలో డబ్బు నిలిచే చోట పెట్టడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలువ ఉంటుందంట.
ఎందుకంటే కలబంద పువ్వును సంపద ఆకర్షించే పువ్వు అంటారు వాస్తు శాస్తర నిపుణులు. అందువలన ఎవరి ఇంట్లో అయితే అది వికసిస్తుందో, వారి ఇంటిలోపల ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. అదే విధంగా సంపద వృద్ధిని కూడా ఇది సూచిస్తుందంట.
అలాగే కలబంద పువ్వు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతుంటారు. అందువలన ఎవరి ఇంట్లోనైతే ఈ పువ్వు వికసిస్తుందో ఆ ఇంటి వారు చాలా అదృష్టవంతులు అంట. అది శ్రేయస్సు, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తులను కూడా దూరం చేస్తుందంట.
ఇంటి లోపల కలబంద పువ్వు వికసించడం అనేది, మీ ఇంటి వాతావరణం శుభప్రదంగా ఉందని, సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తుంది. ఇది శ్రేయస్సు, అదృష్టం మీ వద్దకకు వచ్చే సమయం ఆసన్నం అయినది అని సూచిస్తుందంట.
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. )
































