ఇల్లును ఇలా తుడిస్తే ఒక్క దోమ, ఈగ కూడా రాదు..

ఆడవాళ్లు ఇంటిని ప్రతి రోజూ లేదా రెండు మూడు రోజులకోసారి ఖచ్చితంగా తుడుస్తుంటారు. దీనివల్ల ఇళ్లు శుభ్రంగా ఉంటుంది. అయితే ఇంటిని తుడిచే నీటిలో కొన్ని కలిపితే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు తెలుసా? అవేంటంటే?


వాతావరణం మారుతున్న కొద్దీ దోమల బెడద పెరుగుతూనే ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్ తో మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చు. ముఖ్యంగా ఇళ్లును తుడుస్తూ. అవును ఇంటిని తుడిచే నీటిలో కొన్ని పదార్థాలను కలిపి తుడిస్తే ఇంట్లోకి చీమలు, దోమలు రానేరావు. ఇందుకోసం ఏ చేయాలంటే?

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. దీన్ని మనం ఎన్నో ఆహారాల్లో వేస్తుంటాం. ఇది ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది దోమలను రాకుండా కూడా చేయగలదు తెలుసా? అవును ఈ కిచెన్ మసాలాను మాప్ నీటిలో కలిపి ఇంటిని తుడిస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. అవును దాల్చిన చెక్క వాసన దోమలకు అస్సలు నచ్చదు. దీంతో దోమలు ఇంట్లోకి వచ్చే సాహసం చేయవు.

ఎలా ఉపయోగించాలి

దాల్చిచ చెక్కతో దోమలను ఇంట్లోకి రాకుండా చేయాలంటే.. 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలను తీసుకుని నీటిలో మరిగించండి. ఆ తర్వాత చల్లార్చి ఈ దీన్ని మెత్తగా రుబ్బుకుని ఈ వాటర్ తో ఇంటిని తుడవాలి. దీంతో దోమలు ఇంట్లోకి రావు.

article_image4
డిష్ వాషర్ సబ్బు

డిష్ వాషర్ సబ్బుతో కూడా దోమలను తరిమికొట్టొచ్చు. ఇందుకోసం దీన్ని మాప్ నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. ఈ విధంగా చేస్తే ఇంట్లోకి దోమలు, ఈగలు రానేరావు. ఉన్నదోమలు, ఈగలు కూడా పారిపోతాయి.

ఎలా ఉపయోగించాలి

ఈ నీటితో రోజుకు 2 సార్లు ఇంటిని తుడవాలి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసిన తర్వాత నేలను సాదా నీటితో కూడా శుభ్రం చేయాలి.

వెనిగర్
వెనిగర్ తో కూడా మీరు దోమలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. ఇంట్లోంచి దోమలను నాశనం చేయడానికి ఇంటిని తుడిచే నీటిలో వెనిగర్ ను కలపాలి. వెనిగర్ బలమైన వాసనకు దోమలు పారిపోతాయి.

కర్పూరం
కర్పూరం వాసన దోమలకు అస్సలే నచ్చదు. వీటి వాసన వచ్చిన చోట ఒక్క దోమ కూడా ఉండదు. అందుకే ఇంట్లోంచి దోమలను తరిమికొట్టడానికి కర్పూరం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం కర్పూరాన్ని గ్రైండ్ చేసి నీటిలో కలిపి ఇంటిని తుడవండి. లేదా కర్పూరం ముక్కలను ఇంట్లోని ప్రతి మూల ఉంచండి. దీని వాసనకు ఇంట్లోంచి దోమలు పారిపోతాయి.