ప్రస్తుతం కీళ్లనొప్పులు సర్వసాధారణంగా మారిపోయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రం కనిపించే కీళ్ల నొప్పుల సమస్య ప్రస్తుతం తక్కువ వయసులో ఉన్న వారిని సైతం వేధిస్తున్నాయి.
దీంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్థరైటిస్ సమస్య ఎక్కువవుతోంది. అయితే తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య దరిచేరకుండా ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మూడు పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండెకు మేలు చేస్తుంది. కాబట్టి ద్రాక్షను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* అవకాడో కూడా అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
* స్ట్రాబెర్రీలలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇందులోని విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ అలాగే కీళ్ల నొప్పులను నియంత్రించవచ్చు. రోజుకు 2 స్ట్రాబెర్రీలను తినే వారి శరీరంలో సి-రియాక్టివ్ ప్రోటీన్ తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ఫలితంగా కీళ్లనొప్పులు అదుపులోకి వస్తాయి.
* వీటితో పాటు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి బయటపడాలంటే వ్యాయామాలు అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే హెవీ వ్యాయామాలు చేయడం వల్ల కీళ్ల నొప్పు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కీళ్ల నొప్పులు తగ్గాలంటే ధూమపానం అలవాటును పూర్తిగా మానేయాలి. మద్యపానం కూడా కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.