బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!

www.mannamweb.com


పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. కనకాయలంక గ్రామం రెండు గోదావరి పాయల మధ్య ఉంటుంది. ప్రస్తుతం వారం రోజులుగా ఇక్కడ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గ్రామంలోని వంద మందికి పైగా విద్యార్థులు నిత్యం కోనసీమ జిల్లా మానేపల్లి ఉన్నత పాఠశాలకు, రాజోలు కళాశాలకు చదువుల నిమిత్తం వెళ్తుంటారు. చాకలిపాలెం వైపునకు వెళ్లే కాజ్‌వే వారం రోజులుగా వరద ముంపులో ఉంది. ఒకటో రెండు రోజులైతే పాఠశాలకు వెళ్లడం మానేస్తారు. వారం పది రోజులంటే చదువులో వెనకబడిపోయే పరిస్థితి. చేసేదేమీ లేక రోజూ పడవపైనే వరద గోదావరి దాటి ఇలా చదువుకోవడానికి వెళ్లొస్తున్నారు.