ఉత్తరాలు రాసి పంపిస్తే.. భక్తుల కోరికలు తీర్చే వినాయకుడు..ఎక్కడున్నాడంటే?

భారతదేశంలో ఉన్న ఫేమస్ వినాయకుడి ఆలయాల్లో జైపూర్‌లోని గణేష్ ఆలయం ఒకటి. ఇక్కడ గణపయ్య బాల గణేశుడి రూపంలో కొలువుదీరాడు. ఇక ఈ ఆలయానికి ఓ ప్రత్యేకమైన ఆచార సంప్రదాయం ఉంది.


అది ఏమిటంటే? ఎక్కడైనా సరే దేవుడి ఆలయానికి వెళ్లి మన మనసులో కోర్కెలు కోరుకుంటే ఆయన నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ మాత్రం తమ కోరికలను లేఖలో రాసి వినాయకుడికి పంపిస్తే, ఆయన తమ కోరికలు తీర్చుతాడంట.

జైపూర్‌లో ఉన్న ఈ గణేష్ ఆలయానికి 300ల సంవత్సరాల చరిత్ర ఉన్నదంట. ఎందుకంటే ? దీనిని 18 వ శతాబ్ధంలో మహారాజా సవాయి జై సింగ్ II సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో గణపతిని చూడగలిగే విధంగా ఆయన ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవంటారు. ముఖ్యంగా ఇక్కడ వినాయకుడు తొండం లేకుండా,పురుషాకృతి రూపంలో బాలగణపయ్యగా కొలువుదీరాడు. దేశ్యప్తంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి.

ఈ ఆలయంలోని బాల గణపయ్యకు భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి లేఖలు పంపుతారంట. అంతే కాకుండా, వినాయకుడి వాహనం ఎలుకల ద్వారా భక్తులు తమ సమచారాన్ని, గణపయ్యకు చేరవేస్తారంట. అందుకే ఈ గుడి ప్రాంగణంలో రెండు పెద్ద ఎలుకలను ప్రతిష్టించారంట. భక్తులు తమ సమస్యలను, కోరికలను ఎలుక చెవుల్లో గుసగుసలాడుకుంటారు. ఈ ఎలుకలు భక్తుల సందేశాన్ని నేరుగా గణనాథుడికి తెలియజేస్తాయని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

అంతే కాకుండా, ఈ టెంపుల్‌కు ఉన్న ప్రత్యేకత తమ కోరికలను తీర్చుకోవడానికి లేఖలు పంపుతారు. అలాగే వివాహం, కొత్త ఇల్లు, ఉద్యోగం లేదా సంతానం వంటి శుభ సమయాల్లో గణపయ్యకు ఆహ్వానం పంపుతారంట. ఇంకొందరు తమ కోరికలు నెరవేర్చుమని వందలాది ఉత్తరాలను ఆలయ చిరునామ రాసి గుడికి పంపిస్తారంట. అవి బాల గణపయ్య పాదాల వద్ద ఉంచుతారంట.

అలాగే ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన కట్టాడాలు, అక్కడి చరిత్ర అన్నీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయంట. మరీ ముఖ్యంగా ఈ గణపయ్యను చేరుకోవాలి అంటే 365 మెట్లు ఎక్కాలంట. సంవత్సరానికి 365 రోజులలా, 365 మెట్ల ఎక్కాలంట.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.