గుండె, మెదడులోని ధమనులు మూసుకుపోవడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇది ఇటీవలి కాలంలో అందరికీ తెలిసిన అంశం. కానీ, కాళ్ళతో సహా శరీరంలోని ఇతర భాగాల ధమనులలో మూసుకుపోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి.
ముఖ్యంగా కాళ్ళ ధమనులలో మూసుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని బట్టి ముందుగానే అప్రమత్తం అవ్వాలని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లల్లో కనిపించే కొన్ని సింప్టమ్స్ గుండెపోటు ముప్పును గుర్తు చేస్తాయని చెబుతున్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.
గుండెపోటును ముందుగా హెచ్చరించే సంకేతాలు.. మొట్ట మొదటిది కాళ్ల వాపులు. ఎక్కువ సేపు కూర్చుని ఉన్నా, నిలబడినా శరీరంలో ఉన్న నీరంతా పాదాలకు చేరుకుంటుంది. ఫలితంగా అక్కడ వాపులు ఎక్కువగా కనబడేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గుండె సరైన విధంగా పని చేయదో అప్పుడు పంపింగ్ సరిగ్గా జరగదు. ఫలితంగా శరీరంలో ఉన్న ఫ్లూయిడ్ అంతా చర్మం కిందకు వచ్చి చేరుకుంటుంది. ఇదే క్రమంగా వాపులకు దారి తీస్తుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెతో పాటు కాళ్లలో కూడా అడ్డంకులు వస్తాయి. దీనిని పరిధీయ ధమని వ్యాధి (PAD) అంటారు. నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. నడిచేటప్పుడు కాళ్ల కండరాల్లో నొప్పి వస్తుంది. విశ్రాంతి తీసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది. కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు అనుభవం కలుగుతుంది.
పాదాల రంగు మారి చల్లగా అనిపిస్తాయి. గాయాలు, గీతలు త్వరగా నయం కావు. కాళ్లపై జుట్టు రాలిపోతుంది. చర్మం పొడిగా మెరుస్తూ కనిపిస్తుంది. గోర్లు నెమ్మదిగా పెరిగి, పెళుసుగా మారతాయి. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఈ రకమైన నొప్పి సాధారణంగా దూడలు, తొడలు, తుంటితో సహా శరీరం దిగువ భాగంలో సంభవిస్తుంది. ఈ నొప్పి నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు సంభవిస్తుంది. ఇది విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గుతుంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)































