Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు.. ఇంతకీ సైఫర్ కేసు ఏమిటీ?

Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్‌ ఖురేషీలకు సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు ఒక రహస్య దౌత్యపరమైన లేఖకు సంబంధించింది. 2022లో పాకిస్తాన్ అధ్యక్ష పదవీచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో ఓ రహస్య లేఖను ప్రదర్శించారు. అదే ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వం, అమెరికాపైనా సంచలన ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించాలని అమెరికా కోరుకుందని, తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అందుకు ఇదే ఆధారం అని రహస్య లేఖను చూపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసునే సైఫర్ కేసు అంటారు.
ఈ కేసు విచారించడానికి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఆ కోర్టు కేసు విచారించింది. తాజాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు, మాజీ విదేశాంగ మంత్రి షామ మహమూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Related News