సుకన్య సమృద్ధి యోజనలో.. నెలకు రూ. వెయ్యి కడితే.. 5 లక్షల లాభం

www.mannamweb.com


సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెట్టుబడి పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ పథకాల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలను అందుకోవచ్చు. ఇక ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్న సమృద్ధియోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఆడపిల్లల పేరిట ఖాతా ఓపెన్ చేసి నెలకు 1000 కడితే ఏకంగా 5 లక్షలు అందుకోవచ్చు. ఈ మొత్తం ఆడబిడ్డల చదువుకు, పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? వెంటనే దగ్గర్లోని పోస్టాఫీస్ ను సంప్రదించండి.

మీ కూతురుకు మంచి భవిష్యత్ అందించాలనుకుంటున్నారా. అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. సుకన్య సమృద్ధియోజన పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరిట ఖాతాలు ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీంలో చేరాలంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం ఆధారపడి ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు నిండాక ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు. ఖాతా తెరిచేందుకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితోపాటు తల్లి గాని తండ్రి గాని పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా జమ చేయాలి.

నెలకు రూ. 1,000 పెట్టుబడితో చేతికి రూ. 5.50 లక్షలు:

సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ. 1,000 డిపాజిట్ చేయొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 5.50 లక్షల వరకు పొందే వీలుంది. నెలకు రూ. వెయ్యి చొప్పున పెట్టుబడి పెడితే ఏడాదిలో మొత్తం రూ. 12,000 జమ అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.1,80,000 పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడిపై 8.2 శాతం వడ్డీ అందిస్తున్నది. వడ్డీ రూపంలో 3,74,206 వస్తుంది. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం 8.2 శాతం వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 5,54,206 లక్షలు చేతికి అందుతాయి.