ఈ ఏడాది ఇన్వెస్టర్లు అందరి నోటా ఒకటే మాట సిల్వర్.. సిల్వర్… సిల్వర్ ఒకప్పుడు బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి కొనుగోలు చేసి ఆభరణాలు తయారు చేయించుకునేవారు.
అలాంటి వెండి ఇప్పుడు ప్రతిరోజు రాకెట్ వేగంతో పెరుగుతూ చుక్కలను తాకుతుంది అని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే వెండి ధర దాదాపు రెట్టింపు పెరిగింది. ముఖ్యంగా జనవరి నెలలో ఒక కేజీ వెండి ధర 85 వేల రూపాయల వద్ద ఉండగా ప్రస్తుతం అక్టోబర్ 14వ తేదీ నాటికి వెండి ధర 2 లక్షల రూపాయలు తాకి సరికొత్త రికార్డును సృష్టించింది.
గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే వెండి ధర ప్రతిరోజు రూ. 5000 – 10,000 చొప్పున పెరిగినట్లు గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెండి కి అమాంతం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వెండి ధరలు చుక్కలను తాగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వెండిని ఎక్కువగా ఇండస్ట్రియల్ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తున్నారు ఈ కారణంగానే ఇండస్ట్రియల్ డిమాండ్ కు అనుగుణంగా వెండి ధర భారీగా పెరగడం ప్రారంభించింది. వెండిని ఎక్కువగా సోలార్ ప్యానల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, అలాగే మెడికల్ డివైసెస్ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా వెండి వాడకం పెరిగింది. గ్రీన్ ఎనర్జీలోో భాగంగా సోలార్ ప్యానల్స్ వాడకం విరివిగా పెరుగుతున్న నేపథ్యంలో వెండి సప్లై కన్నా డిమాండ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ధరలు అమాంతం చుక్కలను తాగడం ప్రారంభించాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెండి ఏ దేశాల్లో అత్యధికంగా లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెక్సికో – సుమారు 6,000 టన్నులు (ఏడాదికి)
చైనా – సుమారు 3,000 టన్నులు
పెరూ – సుమారు 2,800 టన్నులు
చిలీ – సుమారు 1,200 టన్నులు
ఆస్ట్రేలియా – సుమారు 1,000 టన్నులు
పోలాండ్ – సుమారు 900 టన్నులు
. ప్రపంచ స్థాయిలో వెండి ఉత్పత్తిలో భారత్ కేవలం ఒక శాతమే. కానీ ప్రపంచవ్యాప్తంగా వెండిని దిగమతి చేసుకుంటున్న . దేశాల్లో భారత్ స్థానం మూడవదిగా ఉంది. దీని బట్టి భారతదేశంలో వెండి కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే లాటిన్ అమెరికా దేశాల్లో వెండి ఎక్కువగా లభిస్తుంది. . ఈ దేశాల్లో జింక్, కాపర్, సీసం మైనింగ్ ఎక్కువగా నిర్వహిస్తారు. ఆ గనుల్లోనే ఈ వెండి కి సంబంధించిన రాళ్లు లభిస్తాయి. వెండి రాళ్ల నుంచి వెండిని విడిదీసి శుద్ధి చేసి విక్రయిస్తారు.
































