ఈ కూరగాయాలు తింటే యూరిక్ లెవల్స్ పెరగడం ఖాయం

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ ఉండే ఆహారం విచ్ఛిన్నం నుంచి ఏర్పడిన వ్యర్థం.

ఈ యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయడం చాలా అవసరం. లేదంటే గౌట్, కిడ్నీల్లో, కీళ్లలో సమస్యలు రావడం ఖాయం.

అయితే కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వీటిల్లో యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వంకాయలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. ఈ కూరగాయ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మేలు.

యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉండే వాటిల్లో మష్రూమ్స్ కూడా ఒకటి. ఎందుకంటే వీటిల్లో కూడా అధిక మోతాదులో ప్యూరిన్ ఉంటుంది. ఈ కూరగాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు దీనికి దూరంగా ఉండటం మేలు.

పచ్చి బఠానీల్లో కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే బెటర్. బ్రోకలీ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇందులో కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మితంగా తీసుకోవాలి.

పాలకూరలో ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. కానీ ఇందులో ప్యూరిన్ కూడా అధికంగా లభిస్తుంది. పాల కూర, టమాటాల్లో ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.