నిన్న అంటే ఆగష్టు 15 వ తేదీన దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంది. దేశంలోని నలుమూలలా త్రివర్ణ పతాకాలలో గగన సీమ త్రివర్ణ పతాక శోభితమయ్యాయి.
మన దేశానికి 15 ఆగస్ట్ 1947న స్వాతంత్ర్యం వచ్చిందని అందుకే భారతదేశ ప్రజలు ఈ రోజున స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు, అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15 వ తేదీన కాకుండా ఆగష్టు 16 న జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక గ్రామం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవం 15న కాదు ఆగస్టు 16న అంటే ఈరోజు జరుపుకుంటుంది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న థియోగ్‌లో ఆగస్టు 16న స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సంప్రదాయం ఉంది. 1947 నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఆగస్ట్ 16న స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే థియోగ్ స్వాతంత్ర్య చరిత్రను గురించి తెలుసుకోవాలి.
ఆగస్టు 16న విముక్తి పొందిన థియోగ్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశం అనేక రాచరిక రాష్ట్రాలుగా విభజించబడి ఉంది. 1946లో స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందు అనేక మంది రాజులు, నిజాంల నుండి దేశంలోని 360 రాచరిక రాష్ట్రాలను విముక్తి జరిగింది. అలాంటి రాచరిక రాష్ట్రాలలో ఒకటి థియోగ్. దీని కోసం విముక్తి కోసం యుద్ధం కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ఇక్కడి ప్రజలు ఆనాటి రాజుపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. 16 ఆగస్టు 1947న ప్రజలు బాసా థియోగ్‌లోని రాజా కరంచంద్ ప్యాలెస్ ను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ప్రజల ఒత్తిడితో రాజు సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత థియోగ్ చివరకు ఆగస్టు 16న స్వాతంత్ర్యం పొందింది. ఇలా ఇక్కడ దేశంలో ఒక ప్రాంతంగా కలుస్తూ మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఆగస్టు 16న థియోగ్‌లో మొదలైంది.
రెండు రోజులుగా సాగే స్వాతంత్య్ర ‘జల్సా’
ఇక్కడ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘జల్సా’ పండుగ అంటారు. స్వాతంత్ర్యం తరువాత సూరత్ రామ్ ప్రకాష్ ప్రజామండలానికి ప్రధాన మంత్రి అయ్యాడు. అతనితో పాటు హోం మంత్రి బుద్ధిరామ్ వర్మ, విద్యా మంత్రి సీతారాం వర్మ సహా ఎనిమిది మంది నాయకులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15,16 తేదీలలో రెండు రోజుల పాటు జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ రెండు రోజులు నగరమంతా పెళ్లికూతురులా ముస్తాబవుతుంది. పలు రకాల క్రీడా పోటీలు కూడా నిర్వహించడం సంప్రదాయంగా మారింది. అంతేకాకుండా స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వ్యక్తులను కూడా ఈ రోజు స్మరించుకుంటారు. థియోగ్ మొత్తం జనాభా ఈ రోజున చారిత్రాత్మక పొటాటో గ్రౌండ్‌ను సందర్శిస్తారు. అక్కడ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. జల్సా పండుగ సందర్భంగా థియోగ్‌లో ప్రతి సంవత్సరం ఆగస్టు 16న స్థానిక సెలవుదినంగా ఇవ్వబడుతోంది.