India Deports : ఇండియా కూడా స్టార్ట్.. అక్రమ వలసదారులని వెనక్కి.. ఫస్ట్ బ్యాచ్ లో

తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దేశం, ఆ దేశం అని కాదు.. ఏ దేశ పౌరులైనా..


అక్రమంగా ఉంటున్నారని గుర్తిస్తే చాలు.. వారిని వారి వారి స్వదేశాలకు పంపేస్తోంది అమెరికా. అక్రమ వలసదారులను వెతికి మరీ పట్టుకుని పంపేస్తున్నారు అక్కడి అధికారులు.

ఇప్పుడు అదే బాటలో ఇండియా కూడా వెళ్తోంది. ఇండియా కూడా స్టార్ట్ చేసింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా భారత్ లో ఉంటున్న వారిని వెనక్కి పంపుతోంది. అలాంటి వారిని ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది భారత్ గుర్తించింది.

జీవితకాల నిషేధమా? అటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల్లో వణుకు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది. వారి వీసా గడువు ముగిసిపోయింది. అయినా ఇంకా ఇక్కడే ఉన్నారు. ఢిల్లీలోని ద్వారకలో నివాసం ఉంటున్నారు. అలాంటి వారిని 16 మందిని అధికారులు గుర్తించారు. వారందరిని వెనక్కి పంపేసింది. వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఐదు మంది ఉన్నారు.

ఇందులో ఓ కుటుంబం ఉంది. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇక, నైజీరియాకు చెందిన తొమ్మిది మంది ఉన్నారు. గినియా నుంచి ఒకరు, ఉబ్జెకిస్థాన్‌ నుంచి ఒకరు ఉన్నారు. వారందరిని డిటెన్షన్‌ కేంద్రాలకు తరలించిన అధికారులు.. అక్కడ నుంచి వారి స్వదేశాలకు పంపేశారు.