ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా.. అప్పటికల్లా సాకారం

www.mannamweb.com


ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకారం 2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం 3.6 ట్రిలియన్‌ డాలర్లతో 5వ స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.

కాగా 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనుందని అంచనావేస్తున్నారు. అయితే వేగవంతమైన జనభా పెరుగుదలతో దేశం ప్రాథమిక సేవా అవసరాలను తీర్చడంతో పాటు ఉత్పాదనకతను కొనసాగించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్‌అండ్‌ పీ విడుదల చేసిన ‘లుక్‌ ఫార్వర్డ్ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌’ నివేదిక ప్రకారం.. రాబోయే మూడేళ్లలో అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్వవస్థ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే దశాబద్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

ఎస్‌అండ్‌పీ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు 2035 నాటికి సగటున4.06 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రం కేవలం 1.59 శాతం మాత్రమే కావడం గమనార్హం.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధిలో సుమారు 65 శాతం వాటాను కలిగి ఉంటడనున్నాయి. రానున్న రోజుల్లో భారత్‌ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఇదే తరుణలో వేగంగా పెరుగుతోన్న జనాభా దీనికి ప్రతిబందకంగా మారే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన అభిృద్ధిలో పురోగతి ఉన్నా.. భారతదేశ ఆర్థిక వృద్ధి ఆటోమొబైల్స్‌ వంటి కార్బన్‌ ఇంటెన్సివ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడానికి కారణమవుతుందని మూడీస్‌ రేటింగ్స్‌ పేర్కొంది. 2024లో భారత్‌ జీడీ 7.2 శాతం, 2025 నాటికి 6.6 శాతానికి పెరుగుతుందని అంచా వేస్తోంది.