India-Pakistan: ఆ బైక్ కోసం పాకిస్తాన్ అధ్యక్షుడు సగం దేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది.. భారత్-పాక్ ఆర్మీ మేజర్ల స్నేహం వెనుక ఆసక్తికర కథ..

పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన మాణిక్ షా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో (Indo-Pak War) భారత సైన్యాన్ని నడిపించి విజయాన్ని అందించిన ఆర్మీ మేజర్ మాణిక్ షా జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ సినిమా “సామ్ బహుదూర్“ ప్రశంసలు అందుకుంటోంది. ధైర్య, సాహసాలే కాదు.. హాస్య చతురత కూడా కలిగిన సామ్ మాణిక్ షా (Sam Manekshaw) ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. 1971 యుద్ధం (1971 War) సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ (Yahya Khan)ఉన్నారు. భారత్, పాక్ విభజనకు ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్ మంచి స్నేహితులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటూ వేర్వేరుగా లేవు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉండేది. ఆ సైన్యంలో మాణిక్ షా, యహ్యా ఖాన్ కలిసి పని చేశారు. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ సమయంలో మాణిక్ షాకు ఎరుపు రంగు బైక్ (Bike) ఉండేది. అది యహ్యా ఖాన్‌కి బాగా నచ్చింది. ఆ బైక్‌ను వెయ్యి రూపాయలకు మాణిక్ షా నుంచి యహ్యా ఖాన్ కొన్నారు. అయితే ఆ వెయ్యి రూపాయలు చెల్లించకుండా యహ్యా ఖాన్ విభజన తర్వాత పాకిస్తాన్ (Pakistan) వెళ్లిపోయారు.

1971నాటికి యహ్యా ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయిపోయారు. ఆ సమయానికి మాణిక్ షా భారత సైన్యానికి చీఫ్‌గా ఉన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్)ను పాకిస్తాన్ నుంచి వేరు చేయడానికి యుద్ధం జరిగింది. మాణిక్ షా నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ఓడించింది. యుద్ధం అనంతరం మాణిక్ షా మాట్లాడుతూ.. “నా బైక్ ధర కోసం 24 ఏళ్లు ఎదురు చూశాను. యహ్యా ఖాన్ ఆ వెయ్యి రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సగం దేశాన్ని ఇచ్చాడు“ అని కామెంట్ చేశారు.

Related News

Related News