రాష్ట్రంలో భూమి కలిగిన పట్టాదారుల్లో లక్షలాది మంది జీవించి లేరు. కానీ వారి పేర్లతోనే ఇప్పటికీ పట్టాలు కొనసాగుతుండటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 85,41,002 మంది పట్టాదారులు ఉన్నారు. వారిలో 3,91,405 మంది ఇప్పటికే మరణించారు. అంటే మొత్తం పట్టాదారుల్లో 4.58% మంది జీవించి లేరు. ఈ భూములు వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ వారి పేర్లతో బదిలీ కాలేదు.
జిల్లాల వారీ పరిస్థితి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6.92%, అన్నమయ్య జిల్లాలో 6.69%, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 6.44%, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో 6.15% చొప్పున మృతుల పేర్లతోనే పట్టాలు ఉన్నాయి. కుటుంబ పెద్ద చనిపోయి ఏళ్లయినా వారసులు ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు?: ప్రస్తుతం వారసత్వ భూములను రిజిస్టర్ చేయించుకోవాలంటే 1% స్టాంపు రుసుము చెల్లించాలి. దశాబ్దాలుగా తమ వద్దే ఉన్న భూములకు మళ్లీ రుసుము కట్టాలన్న ఆవశ్యకతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొందరికి రుసుము భరించే స్థోమత లేకపోవడం, కుటుంబసభ్యుల మధ్య వాటాల సమస్యలు తేలకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగలేదు. ఇదే కారణంగా పంట రుణాలకు, సంక్షేమ పథకాలకూ రైతులు దూరమవుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం: ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10 లక్షల లోపు విలువైన ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడితే రూ.1,000 మాత్రమే స్టాంపు రుసుము కట్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రతిపాదన చేశారు. ఈ విధానం త్వరగా అమలైతే లక్షలాది కుటుంబాలకు లాభం చేకూరుతుంది.
రిజిస్ట్రేషన్ ఎక్కడ?: ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. అయితే అక్కడ సిబ్బందికి శిక్షణ, కంప్యూటర్లు, పరికరాలు అవసరం అవుతాయి. వారానికి ఒక్కటి లేదా రెండు మాత్రమే జరిగే రిజిస్ట్రేషన్ల కోసం ఈ వ్యయం చేయాలా అన్న సందేహం రెవెన్యూ వర్గాల్లో ఉంది. పైగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసినా మళ్లీ సబ్‌రిజిస్ట్రార్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. కాబట్టి నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం సులభం అన్న అభిప్రాయమూ ఉంది.