సిబిల్ స్కోర్‌తో పనే లేదు.. ఈ యాప్స్‌తో నిమిషాల్లో పర్సనల్ లోన్

www.mannamweb.com


సిబిల్ స్కోర్ (CIBIL score) తక్కువగా ఉందా? లోన్ రాదని బాధపడుతున్నారా? ఇక బాధపడకండి. నేటి డిజిటల్ యుగంలో, క్రెడిట్ స్కోర్లతో సంబంధం లేకుండా, అనేక యాప్స్‌ స్మార్ట్‌ఫోన్ నుంచే ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి.
ఒకప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు వేలిముద్రతోనే లోన్ అందుకోవచ్చు. ఈ యాప్స్‌ లో-సిబిల్ స్కోర్ లేదా అసలు సిబిల్ స్కోరే లేనివారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఆ యాప్స్ ఏవో తెలుసుకుందాం.

క్యాష్‌ఇ (CASHe): అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలా? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా పరవాలేదు. క్యాష్‌ఇ యాప్ ద్వారా రూ.1,000 నుంచి రూ.4 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్ పొందవచ్చు. ఈ యాప్ ప్రత్యేకమైన సోషల్ లోన్ క్వోషియంట్ (SLQ)ని ఉపయోగించి క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తుంది. అంటే, సోషల్ మీడియా ప్రొఫైల్ ఆధారంగా లోన్ అందుకునే అవకాశం ఉంది. తక్కువ మొత్తంలో లోన్, అది త్వరగా కావాలనుకునేవారికి క్యాష్‌ఇ ఒక సూపర్ ఆప్షన్.

ఫైబ్ (గతంలో ఎర్లీశాలరీ): డబ్బు అత్యవసరమై, క్షణాల్లో ఖాతాలో జమ కావాలనుకుంటే ఫైబ్ (Fibe) యాప్ బెస్ట్ ఆప్షన్. కేవలం కొన్ని నిమిషాల్లో, తక్కువ డాక్యుమెంట్లతో రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 21 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ యాప్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ ప్రాసెస్ కావడంతో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.

మనీట్యాప్: మనీట్యాప్ యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు క్రెడిట్ లైన్ అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు ఎంత డబ్బు వాడుకుంటారో, దానిపై మాత్రమే వడ్డీ చెల్లించాలి. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో, మనీట్యాప్ క్విక్ అప్రూవల్స్ అందిస్తుంది. కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు తీసుకునే వెసులుబాటు కోసం చూస్తున్నవారికి ఇది ఒక చక్కటి ఆప్షన్.

క్రెడిట్‌బీ (KreditBee): జీతం తీసుకునే ఉద్యోగి అయినా, సొంత వ్యాపారం చేసేవారైనా, క్రెడిట్‌బీ యాప్ ద్వారా రూ.1,000 నుంచి రూ.5 లక్షల మధ్య లోన్ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతో, క్విక్ అప్రూవల్‌తో, నిమిషాల్లో మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. చిన్న అవసరాల నుంచి పెద్ద ఖర్చుల వరకు, క్రెడిట్‌బీ అన్నింటికీ ఒకే పరిష్కారం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం.

పేసెన్స్ (PaySense): ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి పేసెన్స్ యాప్ అండగా ఉంటుంది. రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్స్ అందిస్తుంది. క్విక్ అప్రూవల్‌, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు పేసెన్స్ ప్రత్యేకతలు. క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా, లోన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా తిరిగి చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు.

నీరా ఫైనాన్స్ (Nira Finance): లో క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి నీరా ఫైనాన్స్ అండగా నిలుస్తుంది. ఈ యాప్ ద్వారా రూ.1.5 లక్షల వరకు క్రెడిట్ లైన్ లభిస్తుంది. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు అందిస్తుంది. క్రెడిట్ హిస్టరీ లేనివారు సైతం నీరా ఫైనాన్స్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

రాపిడ్‌రూపీ: క్రెడిట్ స్కోర్ లేకపోయినా రూ.1,000 నుంచి రూ.60,000 వరకు ఇన్‌స్టంట్ లోన్ అందుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో అప్రూవల్, 2 నుంచి 12 నెలల వరకు తిరిగి చెల్లించే గడువుతో, రాపిడ్‌రూపీ సులభమైన రుణాలు అందిస్తుంది.

టిప్స్: వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే షెడ్యూల్‌తో సహా నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన రుణాలు తీసుకోవడం, సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

గమనిక:ఈ వార్తలో వివరించిన పర్సనల్ లోన్స్, యాప్స్‌కు సంబంధించిన సమాచారం నిపుణులతో సంభాషణ ఆధారంగా అందించినది. ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కాదు. అందువల్ల, ఏదైనా ఉపయోగించే ముందు నిపుణులను సంప్రదించండి. ఏదైనా లోన్ విషయలో కలిగే నష్టానికి లోకల్-18 బాధ్యత వహించదు.