అమెరికాలో అనిశ్చితితో భారత్‌లో పెరగనున్న పెట్టుబడులు.. సంచలన నివేదికలో వాస్తవాలు ఏంటంటే..

www.mannamweb.com


ప్రపంచవ్యాప్తంగా జరిగే కొన్ని సంఘటనలు ఆయా దేశాల్లో విదేశీ పెట్టుబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇటీవల వెల్లడైన ఫిట్చ్ రేటింగ్స్ నివేదికలో 2023 నుంచి యూఎస్‌లోని పెరిగిన వడ్డీ రేట్లు కారణంగా కార్మిక మార్కెట్, డిమాండ్‌పై కొంత ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా రాజకీయాలు అధిక అనిశ్చితి ప్రాంతంగా మిగిలిపోయిందని, ఇక్కడ భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఉండవచ్చని వెల్లడైంది. బలహీనమైన క్రెడిట్ వృద్ధి, వినియోగదారుల వ్యయం మందగించడంలో యూఎస్‌లో మందగమన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ ఏజెన్సీ పేర్కొంది. ఈ ట్రెండ్ 2024 ద్వితీయార్థంలో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అమెరికాలో అనిశ్చితి వల్ల భారతదేశంలో పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

నిరంతర ద్రవ్యోల్బణం, గ్లోబల్ మానిటరీ పాలసీ సడలింపు ప్రారంభం ప్రధాన ప్రతికూల క్రెడిట్ రిస్క్ సంభావ్యతను తగ్గించాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా గతంలో చేసిన కదలికలను అనుసరించి జూన్ ప్రారంభంలో ఈసీబీ తన మొదటిసారి రేటును తగ్గించగా, జూలై చివరలో రెండోసారి తగ్గించింది. రాజకీయపరంగా అమెరికాలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాజకీయాలను అధిక అనిశ్చితితో కూడిన ప్రాంతంగా ఆ నివేదికలో వెల్లడించారు. ఈ అనిశ్చితి కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కీలక మార్కెట్ అయిన భారతదేశంలో యూఎస్‌లో వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ద్రవ్య విధానాన్ని సడలించడం వల్ల భారతదేశంలోకి పెట్టుబడులు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జూలైలో భారతదేశంలో ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ద్రవ్య విధాన సడలింపు ద్వారా యుఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాల మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ, పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేక ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ఏలో రిస్క్-ఫ్రీ రేటు తగ్గుతుందని అంచనా వేస్తున్నందున పెట్టుబడిదారులు భారతదేశంతో సహా ఇతర చోట్ల మెరుగైన రాబడిని కోరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే భారత ప్రభుత్వం బలమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల భారతదేశానికి పెట్టుబడి ఆకర్షణను పెంచుతుందని వివరిస్తున్నారు. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, డాలర్ ఇండెక్స్ కదలికలతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సంఘటనలు, కొంచెం ఎలివేటెడ్ వాల్యుయేషన్ స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే భారతీయ మార్కెట్లలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.